HELOBUJJI

this website brings you ,Indian culture,news,computer education,film news,job notifications,agriculture,auto mobiles,tech news,shops information,sports,India tourism,economy,business,motivational stories, g k questions, health,fashion,life style,love stories,foreign policy,social life, technology,online business,digital market,new govt vacancy,competition exams,current affairs,national news, ,traditions, life style, earn money,,all study materials,tax,arts,nature,latest news,youth life,,army ,

Breaking

16, డిసెంబర్ 2019, సోమవారం

MOTIVATIONAL LIFE SKILLS IN TELUGU









MOTIVATIONAL LIFE SKILLS IN TELUGU



నిన్నటిదాకా  అద్దం ఉండేది అందులో ప్రతి ఒక్కరు వారి ప్రతిమను చూసుకుంటూ వెళ్లేవారు ఈ రోజు అద్దం పగిలి పోయింది. ఆ గాజు ముక్కలు వారికి ఎక్కడ గుచ్చుకుంటాయి ఏమోనని భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. ఎప్పుడైతే మనం ఉపయోగపడని ఇతరులకు తెలుస్తుందో అప్పుడే  వారి రంగు నిజస్వరూపం బయట పడుతుంది. అదేవిధంగా అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు వలన నీడ ఎలాగా ఉంటుందో అలానే మన కష్టకాలంలో మన బంధువులు మిత్రులు ఎంత ఎక్కువమంది  మనతో వుంటే అంత ఎక్కువ సుఖం లభిస్తుంది.

ఎలా  నడుచుకోవాలి



 నువ్వు తప్పుకోవడం వలన ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందంటే అక్కడి నుండి నువ్వు తప్పుకోవడం తప్పు ఏమీ కాదు. చేతి వేళ్లకు గోర్లు పెరిగినంత మాత్రాన గోర్లను మాత్రమే కట్ చేస్తాం అంతేకానీ చేతివేళ్లను కాదు. అలాగే  బంధాలలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే బంధాలను తెంచు కూడదు గొడవలు తగ్గించుకోవాలి అంతేకానీ బంధాలను తెంచుకోకూడదు అని అర్థం చేసుకో

ఎలా ఆలోచించాలి

MOTIVATIONAL LIFE SKILLS IN TELUGU, INSPIRATIONAL STORIES IN TELUGU
MOTIVATIONAL STORIES IN TELUGU 

ఎప్పుడూ పరాయి వారంటూ ఉండరు. మనవారు అంటూ ఉండరు. జనం ఎప్పుడూ విచారంగా ఒక విషయం అంటూ ఉంటారు. ఎవరు ఎవరికి కారని ,ఈ విషయం ఎప్పుడూ చెప్పరు నేను ఎవరి కని. సరైన వ్యక్తి ఎవరంటే తన నిర్ణయాలు తానే సొంతంగా తీసుకునేవాడు నిర్ణయాల పరిణామం ఎలా ఉన్నా ఇతరులపై నింద వేయని వాడు. ఒక్కసారి ఆలోచించు అదృష్టం ముందే రాసిపెట్టి ఉంటే ప్రయత్నం చేయడంలో ఏమి ఉపయోగం ఉంటుంది . నీ అదృష్టం లో ఇలా రాసిపెట్టి ఉందేమో చూడు ప్రయత్నం చేస్తే నీకు దొరుకుతుందని.  ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి స్వభావం వేరు వేరుగా ఉంటుంది . అందరి ప్రవర్తన వేరుగా ఉంటుంది . చూసే కళ్ళు అందరికీ ఒక లాగానే ఉంటాయి. కానీ చూసే దృష్టి వేరుగా ఉంటుంది. అహంకారంతో గుడ్డివాడైన వాడికి అతని తప్పులు కనిపించవు మరియు ఇతరుల మంచి కనిపించదు. ఒక సలహా ఎప్పుడూ గుర్తు పెట్టుకో జీవితంలో ఎప్పుడూ శాంతంగా ఉండు నిన్ను నువ్వు బలమైనవాడు గా తయారు చేసుకోగలవు . ఎందుకంటే లోహం ఎప్పుడూ చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బలంగా ఉంటుంది. అదే  ఇనుము వేడిగా ఉంటే ఏ ఆకారంలో కైనా మార్చవచ్చు. చిన్న చీమ మన  కాలును  కుట్ట కలుగుతుంది. కానీ మీరు చీమ యొక్క కాలిని కుట్ట లేరు. అందుకే ఎప్పుడూ ఎవరినీ చిన్న వారిగా భావించకు. ఎందుకంటే కొన్ని కొన్ని మీరు చేయలేనివి కూడా వారు చేయగలరు. వినడం అలవాటు చేసుకో ఎందుకంటే వాదించే వారికి కొదవలేదు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండటం నేర్చుకో ఏడిపించే వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో పైకి ఎదగడం అలవాటు చేసుకో వెనక్కి లాగే వారు చాలా మంది ఉన్నారు . ఈ ప్రపంచంలో ఎప్పుడూ ప్రోత్సహించడం అలవాటు చేసుకో నిరాశ పరిచే వారికి కొదవలేదు ప్రపంచంలో.  ఏ వ్యక్తి అయినా పరికరాలతో గొప్పవాడు కాదు, ప్రయత్నాలతో మాత్రమే గొప్పవాడు అవుతాడు. పెద్ద భవనాలతో కాదు గొప్ప భావనలతో మహాత్ముడు అవుతాడు. ఉచ్చారణ ద్వారా ఎవరూ గొప్పవారు కారు ఉన్నత ఆచరణ ద్వారా గొప్పవారు అవుతారు.



జీవితంలో ఈ మాటలు తప్పక గుర్తు పెట్టుకో





పరిస్థితులు ,మన అనేవారు ఎప్పుడైతే మనల్ని ఒకేసారి గాయ పరుస్తారో అప్పుడు మనిషిలో లోపలి నుండి బయట నుండి రాయిలాగా దృఢంగా తయారవుతాడు. అందరూ అంటుంటారు ఎక్కువ జనంలో మనుషులు తప్పు పోతారని కానీ వాస్తవానికి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే  దారి తప్పుతారు. ఎవరినైతే నీ జీవితంలో ముఖ్యమని భావిస్తారో ఎప్పుడు వారే నీ జీవితంలో నీకు ఎక్కువ దుఃఖాన్ని ఇస్తారు. ఈ jamana యొక్క అక్షర సత్యం ఏంటంటే డబ్బు ప్రతి నిజాన్ని దాచిపెడుతుంది . త్వరగా లభించేది ఏది చాలా రోజులు నిలువదు ఎక్కువ రోజులు నిలబడే ది అంత త్వరగా దొరకవు దూరం  మనకు తెలియజేస్తుంది. గోడ లో చీలికలు వస్తే గోడ కూలి పోవడం జరుగుతుంది. అదే బంధుత్వాలు లో చీలికలు వస్తే మనిషి గోడలాగా నిలబడతాడు ప్రతి మనిషి గుడికి వెళ్ళి దేవుడిని అడిగే సమయంలో అనుకుంటాడు దేవుడు అన్నీ వింటాడు అని


ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుపెట్టుకో




 ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడే సమయంలో మాత్రం ఇది మర్చిపోతాడు. మనిషి ఏదైనా మంచి పని చేసేటప్పుడు భగవంతుడు అన్నీ చూస్తాడు. అని అనుకుంటాడు అదే మనిషి ఏదైనా తప్పుడు పని చేస్తూ ఉండే సమయంలో ఈ విషయం మరచి పోతాడు. దానం చేసేటప్పుడు భగవంతుడు అందరిలో ఉన్నాడు అనుకుంటాడు. అదే దొంగతనం చేసే సమయంలో ఈ విషయం మర్చిపోతాడు . ప్రేమించేటప్పుడు భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనుకుంటాడు. అదే ద్వేషించే టప్పుడు ఈ విషయాన్ని మరచి పోతాడు. సమయం గడిచిన కొద్ది  జనం మర్చిపోతూ ఉంటారు. సొంత వారిని కూడా సమయం ఏడిపిస్తుంది. దీపం రాత్రంతా వెలుగునిస్తుంది. తెల్లవారగానే ఆ దీపాన్ని జనం ఆర్పి వేస్తారు. గౌరవం అనేది ఏ వ్యక్తికి ఉండదు అవసరాన్ని బట్టి గౌరవం ఉంటుంది. అవసరం తీరగానే గౌరవం నశిస్తుంది. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పు ఎందుకంటే నిజం చెప్పడం వలన నిర్ణయాలు తీసుకోవచ్చు. అదే అబద్దం చెప్పడం వలన దూరాలు పెరుగుతాయి. నీ మనసులో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీని ఎవరు జనం అర్థం చేసుకోకపోతే ఈ ఒక్క మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకో, నిజాయితీకి పొగడ్తలతో పనిలేదు. సువాసన కలిగిన పూల పైన అత్తరు చేయాల్సిన అవసరం ఉండదు. కదా అవి స్వతహాగానే సువాసన వెదజల్లుతూ ఉంటాయి. జీవితంలో ఖాళీ కడుపుతో ఖాళీ జేబుతో మరియు కష్ట సమయాల లో నేర్చుకునే పాఠాలు ఏ గురువు నేర్పలేడు జనం ఎప్పుడు చెడ్డ మాటలను చెడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. నువ్వు చూసే దృష్టి మార్చుకో ప్రపంచం మొత్తం మారిపోతుంది. నువ్వు వెళ్ళే దిశను మార్చే గమ్యం దానికి అదే మారుతుంది. జీవితాన్ని అనుభవించటం అంత సులువేమీ కాదు శ్రమించకుండానే ఎవరూ గొప్పవారు కాదు. ఉలి దెబ్బ తగలకపోతే రాయి కూడా శిల్పం కాదు. నీతో పాటు ఎవరు నడిచిన నడవక పోయినా నీ పయనం కొనసాగిస్తూనే ఉండు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. నువ్వు గమ్యం చేరే వరకు ప్రతి సమస్యను ఎదుర్కోవడం నేర్చుకో సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నించకు. భయపడే వారికి ఈ ప్రపంచంలో ఏదీ దక్కదు. నిలబడి పోరాడే వారికి ఈ ప్రపంచంలో దక్కనిది అంటూ ఏదీ ఉండదు.




రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడకు


మనిషి ఇల్లు మారుస్తాడు బంధుత్వాలు మారుస్తాడు, స్నేహితులను మారుస్తాడు, అయినా సరే ఎప్పుడు అయోమయంతో ఉంటాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. నీకు తెలుసా జీవితంలో పెద్ద రిస్క్ అంటే ఏమిటో రిస్కు తీసుకోకపోవడమే జీవితంలో పెద్ద రిస్క్ అవుతుంది. రిస్కు తీసుకోవడం వలన విజయం పొందుతావు, ఒకవేళ అపజయం పొందితే అనుభవజ్ఞుడు గా తయారవుతారు. జీవితంలో రిస్కు తీసుకోకపోతే జీవితం మొత్తం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. ఎలా ఉన్నావో అలాగే ఉండవలసి వస్తుంది, ఎప్పుడూ ముందుకు సాగలేవు . జీవితంలో అపజయాలు జరిగిపోతాయని ఎప్పుడూ భయపడకు, అపజయం అనేది మీరు చేసే పనికి మరియు మీరు చేసే ప్రయత్నానికి సాక్ష్యంగా నిలుస్తుంది. కింద పడితే గాయాలు అవుతాయి అని భయపడితే జీవితంలో ఎప్పుడూ నడవడం నేర్చుకో లేవు.




ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకో






 ఉదయం నిద్ర లేచేటప్పుడు పశ్చాత్తాపంతో ఆలోచించకు నిన్ను ఏమీ సాధించలేక పోయానని. ప్రతిరోజు ఉదయాన్నే ఆరంభించడానికి ముందు ఇలా ఆలోచిస్తూ ఉండు. నువ్వు ఈరోజు ఏమి సాధించగలవో ఎప్పుడు ఒక పని చేసేటప్పుడు ఇంకో పని మొదలు పెట్టుకోకు, ఆ పని పైనే పూర్తి గ్యాస్తో చేయడం మొదలుపెడితే విజయం నీకు తప్పక వరిస్తుంది, ఇదే విజయం యొక్క రహస్యం. ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది ప్రతి మనిషి తన కలల్ని సాకారం చేసుకోవాలనుకుంటాడు. కానీ పని చేయడానికి మక్కువ అంటూ ఉండదు. కూర్చొని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు, నాలుగు రోజుల జీవితం అయినా సరే జీవితంలో సుఖం అంటూ లేదని. జీవితంలో కొన్ని నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ యొక్క కఠినమైన నిర్ణయాలు నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాయి. చాలా చక్కటి జీవితాన్ని స్థాయి మేలిమి బంగారం ని ఎక్కడ ఉంచిన దాని విలువ అనేది ఎప్పుడూ తగ్గదు.


ఉన్నతస్థాయి వ్యక్తులతో పోటీపడి పని చెయ్




 నిజంగా నువ్వు ఎవరితోనైనా పోటీ పడాలని అనుకుంటే నువ్వు చేసే పని లో అందరి కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో పోటీ పడు. ఒక్కసారి అతనిని పరిశీలించి అతను కూడా మీలాగే ఒక సాధారణమైన  మనిషే. అతను విజయం సాధించగా లేనిదీ మీరు ఎందుకు సాధించలేరు . ఒక్కసారి ఆలోచించండి తుఫాను వచ్చినంత మాత్రాన కొండ కదులుతుందా, ఎప్పుడూ కలదు అలాగే ఒక విజయవంతమైన వ్యక్తి పొగడ్తలకు మరియు విమర్శలకు ప్రభావితం కాడు. చాలా మంది వ్యక్తులు కష్టమైన పనిని మధ్యలోనే వదిలేస్తారు. విజయం అనేది కఠినమైన పనులు చేయడం ద్వారానే దక్కుతుంది. సులువైన పనుల ద్వారా విజయం దక్కితే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో విజయవంతమైన వారుగానే ఉంటారు కదా. సమయం యొక్క విలువను న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకో ఉదయాన్నే ఆరు రూపాయలకు కొన పడుతుంది . అదే పేపర్ సాయంత్రానికి కిలో ఎనిమిది రూపాయలకు అమ్మ పడుతుంది. మీ సమయం యొక్క విలువను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే జీవితం చాలా తక్కువ అవకాశాలను ఇస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి