HOW TO DEVELOP FORESTS
ప్రజల్లో మొక్కలు నాటే వృక్షాలను కాపాడే అలవాటు పెంపొందించేందుకు గ్రామీణ సదస్సులు మరియు అనేక సంఘటిత సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ప్రస్తుత కాలంలో ఎంతగానో ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడానికి ఒక సైనికుడిలా గా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి మనిషి తాను జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ కోసం మూడు మొక్కలు నాటాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత అన్న సందేశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి .ఇప్పుడు పిల్లలు మొదలుకొని యువకులు ఉపాధ్యాయులు ,అధికారులు ,ఐఏఎస్ ,ఐపీఎస్, ఐఆర్ఎస్ ,అధికారులు, సినీ, క్రీడా, రాజకీయ, వాణిజ్య ,రంగాల ప్రముఖులు కూడా ఇందులో తప్పక భాగస్వామ్యులు అవ్వాలి. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛమైన గాలి నీరు ఆహారానికి వన సంరక్షణ చేపట్టాలి హరిత స్వప్న సహకారానికి ప్రజలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఒక్కతాటిపైకి రావాలి. ఆకుపచ్చని ఆనందమయ జీవన కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. యువత ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి. కాలుష్యాన్ని నివారించే దీర్ఘకాలంలో ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలను ఉచితంగా అందించాలి. ఎన్ని మొక్కలు నాటాము అనేదానికంటే వాటిలో ఎన్ని బ్రతికాయి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలి. స్థానిక ప్రజలు అధికారులకు బాధ్యతలు అప్పగించి జీవించే మొక్కలు పెంచాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా మొక్కలు నాటుతున్న హరిత సారధులు సంస్థలను గుర్తించి సత్కరిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉంది .పల్లెలు పట్టణాలు నగరాల్లో పార్కులను సక్రమంగా నిర్వహించడంతో పాటు కొత్త పార్కులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి అతితక్కువ పచ్చదనం ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా మొక్కలను పెంచాలి. అప్పుడే ఈనెల పచ్చని హారం గా మారుతుంది. ముందు తరాలకు పచ్చగా బతకడానికి అవకాశం ఉంటుంది.
![]() |
WATER POLLUTION |
అందరం కలిసి హరిత క్రాంతిని ముందుకు నడుపుదాం
భారతదేశం లో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది .కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భూభాగం జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది భారతదేశం. ఈ యొక్క సువిశాల దేశంలో పండని పంట అంటూ లేదు .పెరగని మొక్క అంటూ లేదు . అయితే తలసరి ఒక్కో మనిషికి ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నా లెక్కలు చూస్తే మాత్రం విస్తు పోక తప్పదు. ప్రపంచ తలసరి మొక్కల సగటు 422 అయితే మనదేశంలో మనిషికి 28 మొక్కలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని నగరం ఆయన ముంబైలో మరీ ఘోరంగా ఒక్కో మనిషికి తలసరి నాలుగు మొక్కలు మాత్రమే ఉన్నాయి. మొక్కల విషయంలో కెనడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ దేశంలో ప్రతి మనిషికి 8953 మొక్కలు చొప్పున ఉన్నాయి. తర్వాతి స్థానంలో రష్యా 4461 ఆస్ట్రేలియా 3266 మొక్కలు సగటున ప్రతి మనిషికి ఉన్నాయి. మొక్కల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసం ఉండటానికి కారణాలు అనేకం. అటవీ పర్యావరణ విధానాలు వారసత్వ అటవీ సంపద ప్రభుత్వాలు పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యం జన చైతన్యం ప్రజా భాగస్వామ్యం ఇందుకు కారణాలుగా పేర్కొనవచ్చు .భారత్లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొన్నాయి. ఫలితంగా దేశంలో పచ్చదనం తరిగిపోతోంది అడవులు కనుమరుగైపోతున్నాయి.
అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరిదీ
అడవుల విస్తీర్ణం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తగ్గిపోతుంది. అమెరికాకు చెందిన సంస్థ అధ్యయనం ప్రకారం భూగోళంపై వెయ్యి కోట్ల ఎకరాల అడవులు ఉండగా 1990 నుంచి 12.9 కోట్ల హెక్టార్ల అడవులు అన్యాక్రాంతం అయ్యాయి. వంటచెరకు కలప స్మగ్లింగ్ చెట్ల నరికివేత పట్టణీకరణ ఆక్రమణ అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు తదితర కారణాలతో అరణ్యాలు నానాటికి కుదించుకు పోతున్నాయి. సుమారు 90 కోట్ల ప్రజల నిత్య జీవన అవసరాలకు అడవులే ఆధారం భారతదేశంలో అడవులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. 1988 నాటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో మూడోవంతు భూభాగంలో అడవులు ఉండాలి. అయితే 24 .39 శాతమే విభాగం ఉంది భారత అటవీ సర్వే సంస్థ 2017 లో ఒక నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే వెనకబడి పోయాయి. రాష్ట్రాల్లో నగరాలు పట్టణాల్లో పలుచబడుతుంది. చెరువులు తోటల నగరం గా పేరున్న తెలంగాణ రాజధాని హైదరాబాదులో 60 శాతం హరిత విస్తీర్ణం తగ్గిపోయింది. ఏటా జనాభా వృద్ధి , పెరుగుతున్న స్థిరాస్తి క్రయ విక్రయాలు పట్టణీకరణ కారణంగా అడవులు కనుమరుగు అవుతున్నాయి. నానాటికీ తగ్గుతూ అటవీ విస్తీర్ణం అనేక దుష్ఫలితాలకు దారితీస్తోంది. ఫలితంగా మానవాళి పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది అడవులు తగ్గిపోతూ ఉండడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవడం లేదు భూతాపం పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల ప్రభావం అధికమై ఓజోన్ పొర దెబ్బతింటుంది. కరువు కాటకాలు తీవ్రమై రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీటి కొరత నానాటికీ తీవ్రమై పోతుంది తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ఎంతోమంది అల్లాడుతున్నారు. అడవుల్లో ఆహారం మూగజీవాలు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఇల్లు పంట పొలాలపై దాడిచేసి నష్టం కలిగిస్తున్నాయి. చెట్లు మనిషి శ్వాస ఆహారం ఆరోగ్యం ఆనందమయ జీవితాన్ని ఇచ్చేది చెట్టు తల్లి మాత్రమే. ఒక అభివృద్ధి చెందిన చెట్టు సంవత్సరానికి 24 లక్షల విలువ కలిగిన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆరోగ్యవంతమైన వృక్ష ఏడాదికి 0.53 టన్నుల బొగ్గు పులుసు వాయువు, 1.95 కిలోగ్రాముల కాలుష్య కారకాలను శుద్ధి పరుస్తుంది. రోజు ఒక వ్యక్తి పీల్చే ప్రాణవాయువు పరిమాణం 3 ఆక్సిజన్ సిలిండర్ లతో సమానం. ఒక వ్యక్తి తన జీవిత కాలానికి కావలసిన ఆక్సిజన్ పొందాలంటే మూడు పెద్ద చెట్లు కావాలి. మనిషి జీవితంలో వృక్షాలు ఇంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తి కనీసం ఒక్క మొక్క నాటుతున్న రా అంటే లేదనే చెప్పాలి. ఈ విషయంపై యువతకు సరైన అవగాహన కల్పించాలి. యువత కూడా భవిష్యత్తు కోసం మొక్కల పెంపకం చేపట్టాల్సిన అవసరం తప్పకుండా అందరికీ ఉంది. పండ్ల మొక్కలు నాటడం వలన కొంత ఆర్థికంగా కూడా రైతులు లబ్ధి పొందవచ్చు. అదే సమయంలో పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతినకుండా కాపాడవచ్చు.
![]() |
GREEN ENVIRONMENT |
మానవ మనుగడకు మొక్కలు మూలాధారం
ఎప్పుడూ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి చెట్లకు మించిన సేవకులు ఉపకారం సృష్టిలో లేరు వాటి గొప్పదనం గురించి వర్ణించిన కవి లేరు. జీవజాలానికి ప్రాణవాయువు ఫలాలు అందించే చెట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు అవి లేనిదే అది లేదు మీరు లేదు చివరికి నాగరికత లేదనడం అతిశయోక్తి కాదు. ప్రకృతిలో భాగమైన చెట్టు పుట్ట నదులను పూజించే గొప్ప సాంప్రదాయం భారతీయులది .ఇదే సమయంలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా హరిత నష్టం జరుగుతున్నది. మనదేశంలోనే కావడం ఆందోళన కలిగించే అంశం తలసరి మొక్కల విషయంలో దేశం అట్టడుగు స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చీకటిలో చిరుదీపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు పచ్చదనానికి యువకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని భాగస్వాములను చేస్తూ మన అందరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది దేశంలో ఏ ఒక్కరి సమస్య కాదు ఏ కులానికి మతానికి జాతికి వర్ణానికి ఏ భాషకు చెందిన సమస్య కాదు. ఇది మన భారతీయుల అందరి సమస్య ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై చైతన్యవంతం అవడం ఎంతో అవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి