LIFE SKILLS IN TELUGU
జీవితంలో జరిగే పెద్ద పొరపాటు ఏమిటంటే ఏదైనా మనం తప్పు చేస్తే దాని నుండి మనం గుణపాఠం నేర్చుకోకపోవడమే పెద్ద పొరపాటు . ఎవరైనా వ్యక్తి నీతో బంధుత్వాన్ని కొనసాగించడానికి ఇష్టపడకపోతే అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. సమయం వారికి తప్పకుండా గుణపాఠం నేర్పిస్తుంది. అంతవరకు మీరు వే వేచి ఉండాలి. ఈ ముగ్గురి యొక్క అనుబంధాలను ను ఈ మూడు సమయాలలో గుర్తించవచ్చు. భార్యను భర్త పేదవాడిగా ఉన్నప్పుడు, స్నేహితుడిని కష్టాలలో ఉన్నప్పుడు, పిల్లలను తల్లిదండ్రులు ముసలివారు అయినప్పుడు, వారి యొక్క అనుబంధాన్ని గుర్తించవచ్చు . మనం ఏడవడం మొదలు పెడితే అవతలివారు నవ్వడం మొదలు పెడతారు. ఇవి తెలుసుకోవాలంటే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ పనినైనా నిరాటంకంగా చేయడం అలవాటు చేసుకోవాలి
ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. ఒక అలవాటు మిమ్మల్ని అపజయం పొందేలా చేస్తుంది. ఆ అలవాటును తప్పకుండా మానుకోండి లేకపోతే భారీ నష్టాన్ని ఈ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అనగా అనగా రాగ మతిశయిల్లుచునుండు. తినగ తినగ వేము తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు గొప్ప కవులైన ఎందరో మహానుభావులు ఎప్పటినుండో మనల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు. వారి రచనల ద్వారా కాని వాటిని మనం పట్టించుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. పాడగా పాడగా చక్కటి గాయకుడిగా తయారవ్వచ్చు. తినగా తినగా చేదైన వేపాకు కూడా తియ్యగా తయారవుతుంది. చేయగా చేయగా అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటారు . ఇప్పుడు ఇదే మన జీవితంలో అపజయానికి పెద్ద కారణం . మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలంటే ఏ పనినైనా నిరాటంకంగా కొనసాగించాలి. మీరు ఒక విద్యార్థి అయితే మీరు నిరాటంకంగా చదివినట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది. మరియు మీయొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెరుగు పడుతుంది. బయటి ప్రపంచంలో ఎలాంటి పోటీ నైనా మీరు తట్టుకోగలరు నిరాటంకంగా చదివినప్పుడు. కాలేజీ పని దినాలలో మీరు సరిగా హాజరు కాకుండా ఉండడం వలన అది నీకే పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ యొక్క పని ఫలితం నువ్వు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ప్రతి రోజు కాలేజీకి హాజరై ప్రతి క్లాసులు శ్రద్ధగా వింటూ చదువుతూ ఉండు ఈ ప్రక్రియను నువ్వు నిరాటంకంగా కొనసాగించినట్లు అయితే విజయం పొందడం లో నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు.
![]() |
MOTIVATIONAL STORIES IN TELUGU |
ఏ పనినైనా నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగించు
కరుకైన రాయి పైన కూడా మనం రాయగా రాయగా గుర్తులు ఎలా ఏర్పడతాయో అలానే మళ్లీ మళ్లీ అభ్యాసం చేయడం ద్వారా మంద బుద్ధి గల వారు కూడా తెలివైన వారుగా తయారవుతారు. అందుకే ఏ పనినైనా నిరంతరంగా అంటే కంటిన్యూగా చేయాలి. ఏ పనినైనా ఎవరైనా సరే నిరంతరంగా కొనసాగించ లేకపోవడం వల్లనే వారు జీవితంలో అపజయం పొందుతూ ఉంటారు. మీరు ఈరోజు నుంచి ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను ఈరోజు నుండి చదువుతాను ,ఈ రోజు నుండి నా మనసును కంట్రోల్ చేసుకుంటాను, ఈరోజు నేను ఈ పని తప్పకుండా చేస్తాను ,ఒక గంట కాదు రెండు గంటలు చేస్తాను, అని మీరు నిర్ణయం తీసుకొని ఉంటారు. మరుసటి రోజు మీరు ఈ నిర్ణయాలను అన్నింటినీ మర్చి పోవడం జరుగుతుంది. మీరు చదవడం వంటివి చేస్తే ఒక రోజు చదివితే లేదా ఒక రోజు పని చేయడం ద్వారా మీరు విజయం పొందలేరు ఆ పనిని లేదా చదువుని నిరంతరాయంగా నిరాటంకంగా కంటిన్యూగా కొనసాగించినట్లు అయితే మాత్రమే మీరు విజయం పొందగలరు. మన మనసును కూడా ప్రతిరోజు కంట్రోల్ చేస్తూనే ఉండాలి. ఏ పనినైనా ఒకరోజు సంతోషంగా చేయడానికి మొదలుపెడతారు, మరుసటి రోజు మర్చిపోతారు .ఒక రోజు రెండు రోజులు ఆ పని చేయడం వలన ఏమీ ఉపయోగం ఉండదు. మీరు ఒక రోజు రెండు రోజులు జిమ్ కు వెళ్లడం ద్వారా శారీరక మార్పు తీసుకు రాలేరు. కదా సంవత్సరం పొడవునా ఆ పనిని నిరంతరాయంగా కొనసాగించినట్లు అయితే మీ యొక్క శారీరక మార్పు తీసుకు రాగలరు. ఒక నది తన బలంతో కాకుండా నిరంతరాయంగా ప్రవహించడం ద్వారానే పెద్ద పెద్ద కొండల మధ్య నుండి తన దారిని ఏర్పరుచుకో గలుగుతుంది. వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి నిరంతరాయంగా నిరాటంకంగా కురిసినప్పుడు ఆ చిన్న చిన్న బిందువులే నదిగా ప్రవహించడం జరుగుతుంది. మనం జీవితంలో చేసే చిన్న చిన్న ప్రయత్నాలే నిరంతరాయంగా కొనసాగించినట్లు అయితే మార్పు అనేది తీసుకురావచ్చు. విజయానికి మొదటి సూత్రం ఏమిటంటే నిరంతరాయంగా నిరాటంకంగా ప్రయత్నం చేయడం మాత్రమే. మీరు నిరంతరాయంగా ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిరోజు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మీరు గుర్తు చేసుకోవాలి, నీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటో.
జీవితంలో ఎదగాలంటే సోమరితనం వదిలివేయాలి
సోమరితనం అనేది ఏ పనినైనా నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగించడానికి అడ్డు పడుతూ ఉంటుంది. సోమరితనాన్ని మీ జీవితానికి దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఉండండి. పని పై నుండి చదువు పై నుండి నీ యొక్క ధ్యాసను మరల్చకుండా ఉండండి. ప్రతిరోజు ఉదయాన్నే మీ యొక్క జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. నీ యొక్క లక్ష్యాన్ని మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు ఎనర్జీ గా పని చేయగలరు, చదవగలరు అప్పుడు సోమరితనం నీ దరిదాపుల్లోకి రాదు. సోమరి అయిన వ్యక్తికి వర్తమానం అంటూ ఉండదు, భవిష్యత్తు అంటూ ఉండదు, సోమరితనం తో జీవితాన్ని గడపడం అంటే ఆ జీవితం వ్యర్థం అనే చెప్పాలి. జీవితం యొక్క విలువ మరియు సమయం యొక్క విలువ తెలియకుండా సోమరి అయిన వ్యక్తి తన యొక్క విలువైన జీవితాన్ని విలువైన సమయాన్ని వృధా చేస్తాడు. నది ఎలాగ ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుందో తిరిగి రాకుండా, అలాగే జీవితంలో సమయం కూడా మనిషి యొక్క ఆయువును తీసుకొని వెళ్ళి పోతూ ఉంటుంది. సరైన దినచర్య అంటూ లేకపోవడం వలన మనం సోమరులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇదే సోమరితనం మన దినచర్య లాగా అలవాటు అవుతుంది. ఈ సోమరితనం వలనే మన పని పైనుండి మన ధ్యాస మరలడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీ యొక్క లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ ఉండండి. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు దూసుకుపోతూ ఉండండి. ఈ రోజు నుండి మీరు సోమరితనాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాం
విజయవంతమైన వ్యక్తిగా నిన్ను నువ్వు తయారు చేసుకో
సమయం ఎప్పుడూ మనల్ని బాధించదు, సరైన సమయంలో మన తోడును వదిలి వెళ్లే వారే మనకు దుఃఖాన్ని ఇస్తారు. జీవితం ఒక అద్దం లాంటిది, మీరు నవ్వితే అది కూడా నవ్వుతుంది. చెడ్డ వ్యక్తి పై నమ్మకం పెట్టుకొని మోసపోయిన తర్వాత మాత్రమే, సరైన మంచి మంచి వ్యక్తిని గుర్తించే అనుభవం దక్కుతుంది. ఎప్పుడూ చిన్న తప్పుల నుండి చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఏ వ్యక్తి కొండల వలన గాయాలపాలు అవ్వడు చిన్న చిన్న రాళ్ల ద్వారానే గాయాలపాలు చెందుతాడు. జీవితంలో వంద సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు, తక్కువ కాలం బ్రతికిన సరే జనం యొక్క గుండెల్లో నిలిచి పోయేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మోసపోయే వ్యక్తి ఎప్పుడూ మోసం చేసే వ్యక్తి కంటే తక్కువగా కోల్పోతాడు ఏదైనా సరే. ఎంత విచిత్రమో చూడండి, వాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. మనం అవకాశం ఇస్తూనే ఉంటాం. కంటి రెప్పల కింద ఉండే నల్లటి చారలు మనకు తెలియజేస్తాయి, నీ పెదాలపై ఉండే చిరునవ్వు అబద్ధమని. మోసం చేసే వారికి అవకాశం దొరుకుతుంది అంటే దానికి అర్థం మన జ్ఞానం మసకబారి పోయిందని. మోసానికి అవకాశం ఇవ్వడం వలన మనం దోషిగా నిలబడవలసి వస్తుంది.
అదృష్టాలు పై నమ్మకం వదిలేయ్ నీ హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్ముకో
చేతి యొక్క అదృష్ట రేఖ ప్రేరణ లో మునిగి పోకండి. ఎందుకంటే జ్యోతిష్యాలయం లో నీ అదృష్ట రేఖలు అమ్మబడవు కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పోరాడే మీ స్వభావాన్ని మార్చుకోండి. అలవాటు చేసుకో కష్టాల్లో కూడా చిరునవ్వులు చిరునవ్వులు చిందించడం. చెట్టు కింద పెట్టిన విరిగిపోయిన భగవంతుడు విగ్రహాలను చూసి నేర్చుకో, ఈ ప్రపంచం విరిగిపోయిన భగవంతుడి విగ్రహాన్ని ఇంట్లో నుండి బయటకు పంపించి వేసారు. అలాంటప్పుడు మన లెక్క ఎంత, అందుకే నిన్ను నువ్వు నువ్వు విరిగి పోకుండా చూసుకో. ఎవరికి మద్దతు ఇవ్వలేక పోయినా సరే, కానీ ఎవరికి హాని మాత్రం తలపెట్టకు. పువ్వు లాగా వికసించడం నీకు తెలియకపోతే ఏమీ పర్వాలేదు, కానీ ముల్లు లాగా మాత్రం తయారవకు. ఇతరులు మిమ్మల్ని ఎవరూ గుర్తు చేసుకోక పోయినా సరే మీరు ఇతరులను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే సం బంధాలు బంధుత్వాలు సాగించడానికి పోటీ తో పని లేదు కదా! జీవితంలో ఒక మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకో పొగడ్తలతో ఎప్పుడూ కరిగి పోకు, విమర్శలకు కుంగిపోకు. నిన్ను నువ్వు ఇబ్బందులను ఎదుర్కొనేలా తయారు చేసుకో ఎందుకంటే ఇతరులు నీకు ఇబ్బంది కలిగించినప్పుడు బాధ అనేది ఉండదు. ఫకీర్ తో ఎప్పుడూ ఇలా విజ్ఞప్తి చేయకండి, భిక్షాటనకు ఎప్పుడూ రావద్దని, ఎందుకంటే ఫకీర్ బిక్షాటనకు మాత్రమే కాదు ఆశీర్వదించడానికి కూడా వస్తాడు మంచి మనుషులతో ఎప్పుడూ గొడవ పడకు గొడవ పడితే నీతో వారు తిరిగి గొడవపడరు కానీ మీ జీవితం నుండి వారు దూరంగా వెళ్ళి పోతారు. దుఃఖం అనేది ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది అప్పుడే కదా మనకు సుఖం యొక్క విలువ తెలిసేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి