HELOBUJJI

this website brings you ,Indian culture,news,computer education,film news,job notifications,agriculture,auto mobiles,tech news,shops information,sports,India tourism,economy,business,motivational stories, g k questions, health,fashion,life style,love stories,foreign policy,social life, technology,online business,digital market,new govt vacancy,competition exams,current affairs,national news, ,traditions, life style, earn money,,all study materials,tax,arts,nature,latest news,youth life,,army ,

Breaking

13, జనవరి 2020, సోమవారం

TELUGU MOTIVATIONAL STORIES





TELUGU MOTIVATIONAL STORIES





పొడవైన దారం చిక్కుబడి పోతుంది. అనవసరమైన మాటలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే దారాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవాలి . నోట్లో నాలుకను కూడా చాలా అదుపులో ఉంచుకోవాలి. ఇతరులను ఎగతాళి చేసేటప్పుడు మరియు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించు. ప్రజలకు ఎవరికీ చట్టాలు నచ్చవు, మరియు వాగ్దానాలు నచ్చవు. కానీ కేవలం వారి యొక్క ప్రయోజనాలే వారికి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే అర్థం చేసుకోవచ్చు వారి పొగడ్తల వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది అని

భగవంతుడిని మనం శక్తి కావాలని కోరితే మనల్ని కష్టాల్లోకి నెట్టి వేస్తాడు. కష్టాల వలన మీ ధైర్యం పెరుగుతుంది మరియు మీరు శక్తిశాలి గా తయారవుతారు. మీరు సరైన వారు అయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి వారిగా కొనసాగుతూనే ఉండండి సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. చాలామంది సులువైన దారిలో మాత్రమే నడవడానికి ఇష్టపడతారు. చాలామంది నడుస్తున్నారు కదా అని అది సరైన దారి అనుకోవడం కూడా పొరపాటే, నీ దారిని మీరు స్వయంగా నిర్మించుకోండి. ఆ యొక్క దారిని నీ కంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు. గొప్ప పనులు చేయడానికి ఒకటే పద్ధతి ఉంటుంది. మీరు ఏ పని అయితే చేస్తారో దానిని ఇష్టంగా చేయండి.
TELUGU MOTIVATIONAL STORIES, LIFE SUCCESS STORIES IN TELUGU
TELUGU INSPIRATIONAL STORIES 



నీ జీవితం వలన కొందరు జీవితంలోనైనా రంగులు నిండేలా చూడు



 రావి చెట్టు ఆకు లాగా తయారు అవ్వకండి సమయం రాగానే ఎండిపోయి రాలిపోతుంది. గోరింటాకు లాగా తయారవండి ఎండిపోయిన తర్వాత కూడా నూరి తే ఇతరుల జీవితాలలో రంగుని నింపుతుంది. మీరు ఎప్పుడైనా ప్రియమైన మాటలు వినాలి అనుకుంటే దానికంటే ముందు మీరు ప్రియమైన మాటలు మాట్లాడవలసి ఉంటుంది. ఒక దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా దానికి నూనె పోయాల్సి ఉంటుంది . కింద పడిపోతాం అని ఎవరైతే భయపడతారో వారు జీవితంలో ఎప్పుడూ ఎదగలేరు. మనిషి యొక్క రంగు ఎంత ఎరుపు అయినా కావచ్చు, కానీ  వారి యొక్క నీడ మాత్రం నలుపు గానే ఉంటుంది.



అహంకారంతో ఎప్పుడూ ఉండకు




నేను శ్రేష్టమైన వాడిని అనుకోవడం ఆత్మవిశ్వాసం అవుతుంది . అదేవిధంగా నేను మాత్రమే శ్రేష్టమైన వాడిని అని అనుకుంటే అహంకారం అవుతుంది. కష్టాల యొక్క ప్రాముఖ్యత జీవితంలో చాలా ఉంటుంది. మీ విజయం యొక్క ఆనందం పొందాలంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. హృదయాలను గెలవడమే లక్ష్యం గా పెట్టుకోండి, ఎందుకంటే సికిందర్ ప్రపంచాన్ని మొత్తం జయించాడు, అయినా సరే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు మనం ఏదైతే ఆలోచించగలమొ అది మనం చేయగలం. ఇంత వరకు ఎవరూ ఆలోచించనివి మనం ఆలోచించగలము ఎవరు చేయనివి మనం చేయగలం మనం కోరుకున్నది మనకు దొరికితే అది విజయం అవుతుంది దొరికిన దానిని ప్రేమించడంలో ఆనందం ఉంటుంది







అదృష్టవంతులు ఎవరు అంటే వారు మంచివి అన్నీ లభించిన వారు కాదు, ఉన్నవాటిని మంచిగా తయారు చేసుకునే వారు అదృష్టవంతులు. మార్పు లేకుండా ఎదుగుదల అనేది అసంభవం . ఎవరైతే వారి ఆలోచనలు మార్చకుండా ఉంటారో వారు జీవితంలో ఏ మార్పు సాధించలేరు. ఎవరి మనసు నైనా నొప్పించి క్షమించమని అడగడం చాలా సులువు కానీ ఇతరులు మనసును నొప్పించిన సరే వారిని క్షమించడం చాలా కష్టమైపోతుంది. జీవితం మనకు నవ్వు ప్రసాదించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం చేసిన మంచి పనులు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయని, అదే జీవితం మనల్ని ఏడిపిస్తుంటే మంచి పనులు చేయ వలసిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఖాళీ సమయం ఉంటే ఇతరులతో గడుపుతూ ఉంటారు, మరికొంతమంది మన అనుకొని సమయం గడుపుతూ ఉంటారు. జీవితంలో సంపాదిస్తూ యుండు ఖరీదైన వస్తువులు కూడా నీకు ధర తక్కువ వస్తువులు అనిపించేంత వరకు. ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకుంటే నీకు ఆ ఆనందం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది , అదే క్షమించి వదిలేస్తే ఆ యొక్క ఆనందం జీవితకాలం ఉంటుంది.

మంచి వ్యక్తుల విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు



మంచి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడం చాలా సులువైన పని అందుకే ఎప్పుడూ మంచి వ్యక్తులకే చెడు జరుగుతూ ఉంటుంది మోసం చేసే వ్యక్తికి ఈ విషయం అసలు తెలియదు మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే దక్కుతుందని అందుకే ఎప్పుడూ చెడ్డ వ్యక్తిని చూసి చెడ్డవాడిగా తయారవకు మనం వజ్రాన్ని వజ్రంతో వజ్రం తో కోయ గళం అంతేకానీ బురద నీటిని బురద నీటితో శుభ్రం చేయలేము ఎప్పుడు ఈ ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది ఎంతలా అంటే పంట పొలాల్లో బిల్డర్స్ రోడ్డుపైన రైతులు నిలబడ్డారు













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి