HOW TO CREATE YOUTUBE CHANNEL IN 2022
ఆన్లైన్ ప్లాట్ ఫాం లో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా యూట్యూబ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయ్యాక క్రియేటర్స్ కు ఆదాయం అనేది ఇది మొదలవుతుంది. మానిటైజేషన్ అయ్యాక అనేక విధాలుగా డబ్బు సంపాదించడానికి కి మార్గాలు ఏర్పడుతాయి . మీలో ఉన్న టాలెంటును ప్రపంచం ముందు ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు .
మీలో ఉన్న కళలను నైపుణ్యాలను క్రెటివిటీని ప్రపంచానికి చూపుతూ డబ్బును ఆర్జించడానికి చక్కటి అవకాశాన్ని యూట్యూబ్ ప్రపంచానికి మరియు క్రీటర్లకు అందరికి అందిస్తుందనే చెప్పుకోవచ్చు .
how many category in youtube
యూట్యూబ్ లో అనేక రకాలైన కేటగిరి చానల్స్ ను క్రియేట్ చేయవచ్చు నీలో ఉన్న క్రియేటివిటీకి అనుగుణంగా మీయొక్క కేటగిరి ని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది
1) cars and vehicles
2) Comedy
3) Education
4) entertainment
5) film and Animation
6) Gaming
7) How to and Style
8) Music
9) News and Politics
10) Non profits and Activism
11) People and Blogs
12) Pets and Animals
13) Science and Technology
14) Sports
15) Travel and Events
మీకు నైపుణ్యం ఉన్న category లో వీడియోలను రూపొందించవచ్చు .
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలామంది యూట్యూబ్ క్రియేటర్ లు ఇతరుల యొక్క కంటెంట్ను కాపీ చేసి వారి చానల్లో అప్లోడ్ చేయడం చేస్తారు ఇలాంటి పద్ధతి సరైనది కాదు మీ సొంత కంటెంట్ ను క్రియేట్ చేయండి మీకు నైపుణ్యం ఉన్న రంగంలో దానికి సంబంధించిన వీడియోలను చేయడం వలన మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందవచ్చును ఇతరుల యొక్క కంటెంట్ను మీరు వినియోగించడం వలన మీరు కాపీరైట్ ఉల్లంఘన చేసినట్లు అవుతుంది మీయొక్క ఛానల్కు 3 కాపీరైట్ స్ట్రైక్ లు వస్తే ఛానల్ ను యూట్యూబ్ డిలీట్ చేయడం జరుగుతుంది అందువలన మీరు ఇతరుల యొక్క కంటెంట్ను ఉపయోగించకుండా నీ యొక్క సొంత వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయండి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో నీకు కావలసిన కాపీరైటు ఫ్రీ మ్యూజిక్ పొందవచ్చును మీ యొక్క వీడియోల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం
యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు
నీ యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు ముఖ్యంగా యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ ను పాటించాలి మరియు మీయొక్క ఛానల్ చందాదారులు వెయ్యి మంది అయి ఉండాలి మరియు నాలుగువేల గంటల వాచ్ టైం ఉండాలి ఈ యొక్క 1000 మంది చందాదారులు మరియు నాలుగు వేల గంటలు వాచ్ టైం గత 365 రోజుల లోపల పూర్తి చేసి ఉండాలి మరియు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆల్ మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసి ఉండాలి మరియు నీ యొక్క జిమెయిల్ టు స్టెప్ వెరిఫికేషన్ తప్పక ఆన్ చేసి ఉండాలి మీయొక్క ఛానల్ పైన కమ్యూనిటీ గైడ్లైన్స్ వై లెసన్ ఉండకుండా చూసుకోండి చానల్ మానిటైజేషన్ అప్లై చేయడానికి నీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి ఈ యొక్క అర్హతలు అన్నీ మీకు ఉంటే మీరు మానిటైజేషన్ కు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్ లో ఉండకుండా చూసుకోండి ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ లో మూడు మీ ఛానల్ పైన ఉన్నాయంటే మీ ఛానల్ యూట్యూబ్ తొలగించడం జరుగుతుంది.
యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం వలన కలిగే లాభాలు
మీయొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం ఒక తెలివైన పని అని చెప్పుకోవచ్చు మహిళలకు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఖాళీ సమయాల్లో టీవీ సీరియల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం కంటే నీకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో నీకు వచ్చిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు కుకింగ్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ tech వీడియోస్ కూడా చేయవచ్చు డైలీ రొటీన్ బ్లాక్ కూడా చేసి అప్ లోడ్ చేయడానికి అవకాశం ఉంది మానిటైజేషన్ అయ్యాక నీకు సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అనేక బ్రాండ్స్ మరియు కంపెనీలు వారి యొక్క ఉత్పత్తులను ప్రమోషన్ చేయడం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు పెయిడ్ ప్రమోషన్స్ వలన మీరు చాలా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మరియు ఇతరుల యొక్క యూట్యూబ్ ఛానల్స్ ను మరియు ఫేస్బుక్కు పేజీలను ఇంస్టాగ్రామ్ పేజీ లను ప్రమోట్ చేస్తూ కూడా చాలా డబ్బు సంపాదించవచ్చు దీనితో పాటు నీకు సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటిని కూడా సేల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది వీడియోస్ యొక్క ఎడిటింగ్ కు సంబంధించిన అవగాహన కొంతవరకు ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే ఆకర్షణీయమైన కూడా క్రియేట్ చేయడం నేర్చుకొని ఉండాలి క్లిక్ బైట్ అనేది చేయకుండా ఉండం
Travel vlogs చేయండి
చాలామందికి ప్రయాణాలు చేయడం మరియు వివిధ పుణ్యక్షేత్రాలు టూరిస్ట్ ప్లేసులు సందర్శించుకోవడం కొంతమందికి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాల నే మీ ప్రొఫెషన్ లా కూడా ఎంచుకోవచ్చు ప్రస్తుత కాలంలో ట్రావెల్ బ్లాగర్స్ కూడా ఎంతో పేరును మరియు డబ్బు సంపాదించారు నీ యొక్క ట్రావెల్ vlogs ఇతర ప్రొడక్ట్స్ యొక్క పేయిడ్ ప్రమోషన్స్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు వివిధ ప్రదేశాలతో మీరు దర్శించుకుంటూ ప్రపంచానికి ఆ ప్రదేశాల యొక్క గొప్పతనం మరియు దాని చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తూ మీ యొక్క ప్రయాణాలను కొనసాగిస్తూ ఉండవచ్చ మీరు వివిధ ప్రదేశాలను దర్శించుకునే సమయంలో ఆ ప్రదేశాలలోని హోటల్స్ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు మీ ప్రయాణాలతో డబ్బులు సంపాదించవచ్చు
టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ వీడియోస్ చేయండి
ప్రస్తుత కాలం టెక్నాలజీ తో కూడుకున్నది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకవేళ మీలో టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నట్లయితే ఆ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ మీరు కూడా ప్రాచుర్యం పొందవచ్చు ఒకవేళ మీలో ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్నట్లయితే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం ద్వారా కూడా మీరు ప్రపంచాన్ని ఆకర్షణ మీయొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించవచ్చు టెక్నాలజీ వీడియోస్ లో అనేక ప్రొడక్ట్స్ యొక్క రివ్యూలను ఇవ్వవచ్చు మరియు ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించిన లేదా ఒక సాఫ్ట్వేర్ కు సంబంధించిన ట్యుటోరియల్స్ ను కూడా ప్రపంచానికి అందించవచ్చు ప్రస్తుత కాలంలో చాలా మంది యువత టేక్ రివ్యూల ద్వారా చాలా ప్రాచుర్యం లోకి వచ్చారు మరికొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా జనం యొక్క పొందుతున్నారు ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం యూట్యూబ్ పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది యూట్యూబ్ ప్లాట్ఫాం ద్వారా అనేక రకాలైన కోర్సులను ఉచితంగా నేర్చుకో గలుగుతున్నారు మరియు వాటిలో ప్రావీణ్యం సంపాదించి వారి జీవనోపాధికి కూడా ఏర్పరచుకుంటున్నారు
డైలీ vlogs మరియు cooking వీడియోస్ చేయండి
మీరు గృహిణులు అయితే నీకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మీయొక్క ఖాళీ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు నీకు వంట చేయడంలో నైపుణ్యం ఉన్నట్లయితే ఒక కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో మీకు వచ్చిన వంటలను అందరితో షేర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి