HELOBUJJI

this website brings you ,Indian culture,news,computer education,film news,job notifications,agriculture,auto mobiles,tech news,shops information,sports,India tourism,economy,business,motivational stories, g k questions, health,fashion,life style,love stories,foreign policy,social life, technology,online business,digital market,new govt vacancy,competition exams,current affairs,national news, ,traditions, life style, earn money,,all study materials,tax,arts,nature,latest news,youth life,,army ,

Breaking

10, మే 2023, బుధవారం

టైం మానేజ్మెంట్ టిప్స్ తెలుగులో - Time Management Tips in Telugu



టైం మానేజ్మెంట్ టిప్స్ తెలుగులో - Effective Time Management Tips In Telugu 

జీవితంలో సమయానికి ఎవరైతే విలువనిస్తారో సమయాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో ఎవరైతే సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారో వారు జీవితంలో గొప్ప ఎదుగుదలను చూస్తారు. ఎందుకంటే చాలామంది తమ సమయాన్ని సరిగా వినియోగించుకోలేక పోయి విఫలం అవుతారు. నిజంగా మీరు మీ జీవితంలో ఎదగాలనుకుంటే తప్పకుండా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి ప్రణాళిక బద్ధంగా సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా చేయవలసిన పనులను సరైన సమయంలో పూర్తి చేయగలరు. మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో సిద్ధహస్తులుగా తయారవ్వండి సమయాన్ని మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోండి. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఉండవలసిన మొదటి లక్షణం సమయపాలన. ఎంతోమంది విజయవంతమైన వ్యక్తుల జీవితాలను క్షుణ్ణంగా చదవండి వారు సమయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని ప్రతి గంటని ప్రతిరోజు నీ నీరు ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టే మీ జీవితం యొక్క ఎదుగుదల ఉంటుంది. ప్రతి నిమిషం ఎంతో విలువైనది కోల్పోయిన తర్వాత తిరిగి పొందలేము


సమయ నిర్వహణ అనేది మన దైనందిన జీవితంలో ముఖ్యమైన అంశమని మనందరికీ తెలుసు. మీరు విద్యార్థులు ఉద్యోగులు లేదా సొంత వ్యాపారం కలిగిన వారు లేదా వ్యవస్థాపకులు అయినా అయి ఉండవచ్చు. మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి మరియు మీ యొక్క ఉత్పాదకతను పెంచుకోవడానికి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది కీలకమైన అంశం. మీయొక్క సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి దిగువన కొన్ని చిట్కాలు ఇవ్వడం జరిగింది. ఈ చిట్కాలను అమలు చేయడం ద్వారా మీరు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది

Time Management Tips in Telugu



 షెడ్యూల్ ను రూపొందించుకోవడం చాలా ముఖ్యం

చాలామంది సమయాన్ని షెడ్యూల్ రూపొందించుకోకుండా ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవడానికి కష్టమవుతుంది షెడ్యూల్ రూపొందించడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను సరైన సమయంలో పూర్తి చేయవచ్చు. షెడ్యూల్ అనేది మీరు సరైన విధంగా మీ యొక్క పనులను ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించి ఆ కేటాయించిన సమయంలో ఆ పని పూర్తయ్యే విధంగా చూసుకోండి.

 మీ యొక్క పనులకు ఆటంకం కలిగించే వాటిని దూరం పెట్టండి

చాలామంది వారు చేయవలసిన పనులను పక్కనపెట్టి వారికి ఉపయోగపడే పనులను పట్టించుకోకుండా పరధ్యానంలో ఉండిపోతారు. సోషల్ మీడియా ఈ మెయిల్స్ ఫోన్ కాల్స్ వాట్సాప్ నోటిఫికేషన్లు అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని వారి పని పైన ఉండే ఏకాగ్రతను భంగం కలిగించడానికి ఇలా చాలా ఉపకరణాలు ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగులు వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరు మీ యొక్క సమయాన్ని మీ దృష్టి మరల్చకుండా నీకోసం ఉపయోగించుకోండి. మీ యొక్క ఏకాగ్రతను భంగం కలిగించే వాటిని వీలైనంత దూరం పెట్టడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు కొంత అభివృద్ధి సాధించగలరు ప్రశాంతమైన వాతావరణంలో పని చేయండి మీరు ఏ పని నైనా ఏకాగ్రతతో చేస్తే ఆ పనిలో ఎంతో అభివృద్ధి చెందుతారు.


మల్టీ టాస్కింగ్లతో సతమతం అవ్వకండి

కొందరు తలకు మించిన భారాలను నెత్తిన వేసుకుంటారు. ఒకే సమయంలో ఒకే పని కాకుండా అనేక పనులను ఒకేసారి చేయడానికి సిద్ధపడతారు. దీని ద్వారా ఏ ఒక్క పనిని సక్రమంగా నిర్వర్తించలేరు దాని ద్వారా మీ యొక్క ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక పనిని పూర్తి చేసిన తర్వాతనే మరొక పనిని మొదలుపెట్టండి. ఎందుకంటే ఏ ఒక్క పని పైన మీరు సరైన దృష్టి పెట్టలేరు సక్రమంగా నిర్వర్తించలేరు ఇలా చేయడం వలన మీరు అనుకున్న అభివృద్ధిని సాధించలేరు. మల్టీ టాస్టింగ్ అనేది మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది ఒక పని పూర్తి అవ్వకుండానే మరొక పని మొదలు పెడతారు చాలామంది ఇలా మీరు మాత్రం ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మల్టీ టాస్టింగ్ వలన ఎన్నో లోపాలు తలెత్తుతాయి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

 ప్రతి పనికి పూర్తి కావడానికి కావలసినంత సమయాన్ని కేటాయించండి

ఒక పని పూర్తి పూర్తి అవ్వడానికి ఆ పనికి కావలసిన సమయాన్ని కూడా కేటాయించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక పని పక్కా ప్రణాళికతో కావలసినంత సమయం కేటాయించండి తొందరపాటుతనం అనేది పనికిరాదు. అలాగని ఆ యొక్క పనికి కావాల్సినంత సమయం కంటే ఎక్కువ సమయం కూడా కేటాయించకూడదు. ఏ పనైనా సరైన సమయంలో సరైన సమయం తీసుకుని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు చేసే పనిలో నాణ్యత ఉంటుంది ఏకాగ్రతతో పని కూడా చేయగలరు మీయొక్క టైం మేనేజ్మెంట్లో  ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు.


కొంత సమయం విరామం తీసుకోండి ఆరోగ్యం పైన జాగ్రత్త వహించండి

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఏ పనైనా చేయగలం. ప్రతి రంగంలోని వారికి వారి వారి పనుల వలన మానసిక ఒత్తిడి మరియు శారీరక అలసట అనేది సహజం. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు మన పనుల నుండి విరామం తీసుకోవడం కూడా అవసరం. ఈ యొక్క విరామం సమయంలో మీకు నచ్చిన పనులను చేయండి దీని ద్వారా మీరు తిరిగి పని మొదలుపెట్టినప్పుడు మరింత ఉత్సాహంగా ఆ పనిని పూర్తి చేయగలరు. మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామం కూడా కేటాయించండి చాలామంది రాత్రిపూట నిద్రకు సరైన సమయం కేటాయించకుండా టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. దీని ద్వారా సరైన విశ్రాంతి లేక మరుసటి రోజు ఉత్సాహంగా మీ యొక్క పనులను చేసుకోలేరు.

 మీ యొక్క పనులకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి


ఆధునిక ప్రపంచం పోటీ ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో అవసరమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టుకోవాలి. అనవసరమైన విషయాలు ఆలోచించడం కానీ లేదా అనవసరమైన విషయాలపై ఇతరులతో వాదనలు చేస్తూ సంభాషణలు చేస్తూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క టైం మేనేజ్మెంట్ను సరిగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మీరు మీ పనుల పైన మాత్రమే శ్రద్ధ వహించండి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ యొక్క జీవిత ఆశయాలను మరియు మీ యొక్క అభివృద్ధికి తోడ్పడే విషయాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అటువంటి పనులకు ఇవ్వడం ద్వారా మీరు మరింత అభివృద్ధిని పొందవచ్చు.



 ప్రతిరోజు కొంత సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి కేటాయించండి


ఆధునిక ప్రపంచం అత్యంత వేగంగా మార్పులు చెందుతూ వస్తుంది. చెందుతున్న మార్పులపై కొంత అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎందుకంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మిమ్మల్ని మీరు అప్డేటెడ్ గా ఉంచుకోండి ప్రపంచ పోకడలపై అవగాహన పెంచుకోండి. నీ జీవితానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా విద్యను మరే ఇతర అంశాలనైనా నేర్చుకుంటూనే ఉండండి నిత్యం.


ఈ యొక్క టైం మేనేజ్మెంట్ టిప్స్ ను మీరు మీ జీవితంలో ఉపయోగించడం ద్వారా మారింత అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. సమయంతో పాటు సమానంగా పరిగెడుతూ అభివృద్ధి చెందుతూ ఉండడానికి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ టిప్స్ మీ జీవిత ఎదుగుదలకు ఎంతో సహకరిస్తాయి. అందుకే సమయం యొక్క విలువ మన అందరం అర్థం చేసుకొని మన జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి సహకార పడతాయి.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి