LIFE SKILLS
ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది యువత జీవితం పెట్టే పరీక్షలు ఫెయిల్ అవుతున్నారు . చాలా మంది యువత మంచి మార్కులతో సాధించిన సర్టిఫికెట్లు ఉన్న ఎన్నో డిగ్రీలు సాధించి కూడా జీవితం పరీక్షలు ఫీలవుతున్నారు. మరోవైపు సాదాసీదా మార్కులతో పాసైన స్టూడెంట్స్ కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. కొంతమంది యువత చాలా తక్కువ మార్కులతో డిగ్రీలు సాధించి కూడా ఎంతో ఉన్నత స్థాయి పదవులను చేరుకున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. దీనికి కారణం లైఫ్ స్కిల్స్ వలన జరుగుతుందని జరుగుతుందని మనకు అర్థమవుతుంది.
మన జీవితాన్ని మార్చడానికి ముఖ్యమైన 11 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం
సాధారణంగా మనం వింటూనే ఉంటాం మన గురువులు తల్లి దండ్రులు అందరూ మనకు చెప్తూనే ఉంటారు మీకు ఏదో ఒకటి "goal " నిర్ణయించుకోండి అని మనం దానిని నిర్లక్ష్యం చేసి ఎటూ కాకుండా పోతున్నాం. సాధారణంగా మనం గోల్ గురించి మాట్లాడేటప్పుడు బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాం. జీవితంలో ఏదో ఒక గోల్ తప్పకుండా ఉండాలి. మన యొక్క గోల్ ను మనం సాధించడానికి చేయవలసిన ముఖ్యమైన కొన్ని పనులు
మన జీవితాన్ని మార్చడానికి ముఖ్యమైన 11 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం
1 మొదటి లైఫ్ స్కిల్ గోల్ సెట్టింగ్ (goal setting )
సాధారణంగా మనం వింటూనే ఉంటాం మన గురువులు తల్లి దండ్రులు అందరూ మనకు చెప్తూనే ఉంటారు మీకు ఏదో ఒకటి "goal " నిర్ణయించుకోండి అని మనం దానిని నిర్లక్ష్యం చేసి ఎటూ కాకుండా పోతున్నాం. సాధారణంగా మనం గోల్ గురించి మాట్లాడేటప్పుడు బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాం. జీవితంలో ఏదో ఒక గోల్ తప్పకుండా ఉండాలి. మన యొక్క గోల్ ను మనం సాధించడానికి చేయవలసిన ముఖ్యమైన కొన్ని పనులు
(1)మీ లక్ష్యానికి మీరే లొంగిపోండి. (surender yourself to your goal )
( 2 ) చర్య మరియు ప్రణాళిక ( action & planing )
(3) ప్రయాణాన్ని ఆనందించండి. enjoy the journey
2 సృజనాత్మక ఆలోచన( creative thinking )
సృజనాత్మకంగా ఆలోచించే లేకపోవడంతో ఎన్నో కంపెనీలు నష్టాల పాలైన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మార్కెట్ కు అనుగుణంగా ఆ కంపెనీలు తమ ప్రాజెక్టులను మార్చ లేకపోవడం వలన వారు నష్టాలను చవి చూడడం జరిగింది ఉదాహరణకు మీరు ఎన్నో తీసుకోవచ్చు htm, Allwin, kodak ఏ పనిలోనైనా సృజనాత్మకత కొత్తదనం అనేది మనలో ఉంటే మనకు విజయం చేరువవుతుంది.
3 నిర్ణయం తీసుకోవడం (decision making)
మీరు జీవితంలో ఏం సాధించాలని ఉంటున్నారో నిర్ణయం తీసుకోండి. ఉదాహరణకు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు దింపి వేయడం వలన ఆ రోజు గాంధీజీ తీసుకున్న నిర్ణయం ఏమిటి నేను ఈరోజు రైలు నుండి కిందికి నెట్టి నెట్టి వేయబడ్డా కానీ మిమ్మల్ని ఈ దేశం నుండి నేను బయటకు తరిమి వరకు నేను నిద్రపోను అని ఆరోజు గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం అనేది తీసుకోవడం చాలా ముఖ్యం.4 దృష్టి మరియు స్వీయ నియంత్రణ (focus and self control )
ఈ స్కిల్ మనకు చూడడానికి రెండు గా ఉంటుంది కానీ అది ఒక్కటే. మన భావాలపై మన కచ్చితమైన నియంత్రణ అనేది ఉండాలి లేకపోతే మన దృష్టి అనేది మారడం జరుగుతుంది . ఒక్కోసారి గమనిస్తూనే ఉంటాం మనం సర్వ సాధారణంగా ఇతరులు అనుభవించే కార్లు బంగళాలు మరియు ఉద్యోగాలను చూసి మనసు మారుతూ ఉంటుంది.
కానీ అలా మనం ఇతరుల యొక్క సౌకర్యాలను చూసి మన దృష్టి మార్చుకోకుండా ఉండాలి
మన సెల్ఫ్ కంట్రోల్ లో మన నుండి మన యొక్క పనిని ఫోకస్ తో చేయడం వలన మనం మన పనిలో విజయం సాధించవచ్చు.
5 సమాచార నైపుణ్యాలు (communication skills )
మన పనిలో నైపుణ్యం ఎంత అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు కూడా అంతే అవసరం. మనం ఉన్నత స్థానాలకు ఎదగడానికి గొప్ప సంబంధాలను ఏర్పరచుకోవడానికి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మనం జీవితంలో విజయం సాధించడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి
6 రిస్కు తీసుకోవడం ( Risk taking )
జీవితంలో విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవడం ఎంతో అవసరం . రిస్కు తీసుకోకపోవడమే మనం జీవితంలో చేసే పెద్ద రిస్క్
చాలా మంది యువత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు,చాలా మంది success కాకపోవడానికి కారణం రిస్కు తీసుకోకపోవడమే రిస్కు ఎలా తీసుకోవాలి రిస్కు తీసుకునే సమయంలో సరైన అంచనా మరియు సరైన ప్లానింగ్ తో తీసుకోవాలి
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో రిస్క్ తీసుకుని ముందుకు దూసుకు పోవడం అనేది మనకు ఉండాల్సిన మొదటి లక్షణం. మన జీవితంలో ప్రతి చోట రిస్క్ అనేది ఉంటుంది మనం వాటికి భయపడుతూ ఉండడం వలన మన సామర్థ్యం దెబ్బతింటుంది. ఉదాహరణకు కొంతమంది మధ్యాహ్నం లంచ్ టైం అరగంట లేట్ అయినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. చాలామంది విద్యార్థులు రాత్రిపూట చదువుకునే సమయంలో అరగంట ఎక్కువ టైం కేటాయించ లేక నిద్రపోతూ ఉంటారు. నీ ఆలోచనల నుండి బయటకు రండి రిస్కు తీసుకోండి విజయాన్ని మీ సొంతం చేసుకోండి
7 సమస్య పరిష్కారం నైపుణ్యాలు ( problem solving skills )
యువత ఎప్పుడైనా ప్రాబ్లం పైన ఫోకస్ చేయడం వలన ఆ ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది అదే సొల్యూషన్ పైన ఫోకస్ చేయడం వలన మనం విజయం సాధించవచ్చు. ఉదాహరణకు ఒక స్టోరీ శబరిమల కొండలలో ఒక వ్యక్తి తన కారులో ప్రయాణం చేస్తుండగా తన కారు పంచర్ అయింది.
stepney టైర్ మార్చడానికి నట్ బోల్ట్ లు తీసి పక్కన పెట్టాడు. stepney టైర్ ఎక్కించే సమయంలో పొరపాటున అతని చేయి తగిలి నట్ బోల్ట్ లు అన్ని లోయలో పడిపోయాయి. అప్పుడు అతను ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ అలానే నిల్చున్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక కారణం ఆపడం జరిగింది. అతనికి తన యొక్క ప్రాబ్లం ను వివరించాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి మిగతా మూడు టైర్లు యొక్క ఒక్కొక్క nut boltu తీసి ఈ టైర్ కు బిగించ మని చెప్పాడు. చూడండి ఈ స్టోరీ లో ఇతను ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉండి పోయాడు కానీ ఆ కారులో వచ్చిన వ్యక్తి సొల్యూషన్ గురించి ఆలోచించాడు.
8 సమయం నిర్వహణ ( time management )
టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలంటే మన అమ్మకు మించిన గురువు మరెవరూ లేరు. ఎందుకంటే ఉదయం ఎంత త్వరగా లేస్తుంది రాత్రి ఎంత లేట్ గా పడుకుంటుంది. తన భర్త గురించి తన పిల్లల గురించి తన అత్తమామల గురించి ఎలా పని చేస్తూ ఉంటుందో మనందరం చూస్తూనే ఉంటాం. ఇంట్లో ఉండే అందరి కోసం తన టైం ను ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులు చేస్తుందో మనందరం చూస్తూనే ఉంటా
9 స్వీయ నిర్వహణ నైపుణ్యాలు (self management skills )
సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం. సెల్ఫ్ మేనేజ్మెంట్ ను మనం మూడు భాగాలుగా విభజించి చూద్దాం .
(1) mentally : మొట్టమొదటి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి . నీ మనసును ఎప్పుడూ మీ అదుపులోనే ఉంచుకోండి.
మీ యొక్క మనసు ఎప్పుడైతే మీ ఆధీనంలో ఉంటుందో అప్పుడు మీ మనసు మీకు మంచి మిత్రుడిగా ఉంటుంది. అలా కాకుండా మీరు మీ మనసు ఆధీనంలో ఉంటే నీకు అది శత్రువు లాగా తయారవుతుంది.
( 2 )Physically :శరీరాన్ని ఎప్పుడూ సంతుష్టిగా ఉండేలా చూడండి వ్యాయామం చేయండి యోగా చేయండి. మంచి డ్రెస్సింగ్ స్టైల్ అవలంబించండి.
( 3 ) surroundings : మీ పరిసరాలను ఎప్పుడూ చిందరవందరగా ఉండనివ్వండి పరిశుభ్రంగా ఉంచండి. ఉదాహరణకు మనం ఇంట్లో వస్తువులను చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల మనకు అవి సరైన సమయంలో దొరకకపోవడం దాని వలన మన సమయం వృధా అవడం జరుగుతుంది.
10 జట్టు నిర్వహణ ( team management )
Team మేనేజ్మెంట్ స్కిల్స్ ను ఎప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉండాలి. జట్టు నిర్వహణ అనేది ఎంతో సంయమనంతో కూడుకున్నది.
11 రిలేషన్ బిల్డింగ్ స్కిల్స్ ( relation building skills )
మానవ సంబంధాలు అనేవి మాటలతో మొదలవుతాయి . మనం ఏ మానవ సంబంధాల నైనా వాటి నుండి ఏమీ ఆశించకుండా ఉండాలి అవసరమైతే మనమే వారికి సహాయం చేసే విధంగా ఉండాలి. ఏ చోట నైనా బంధుత్వాల లోనైనా స్నేహితుల మధ్య మాటల తగువులు వచ్చినప్పుడు మనం వారితో పూర్తిగా మాట్లాడకుండా ఉండడం చేయకూడదు. మీరు ఎప్పుడైతే పూర్తిగా మాట్లాడకుండా ఉండడం మొదలు పెడతారు అప్పుడు మీకు వారి మధ్య అన్ని దారులు మూసుకు పోవడం అనేది జరుగుతుంది మనం ఇతరులతో కలిసి ఉన్నప్పుడే మనతో ఇతరులు కలిసి ఉంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి