ENVIRONMENT AWARENESS
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు విప్లవాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టు సక్సెస్ అయింది అని చెప్పుకోవాలి.మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరియు కాలుష్యాన్ని నివారించడానికి మన ముందున్న ఏకైక పరిష్కారమార్గం విరివిగా మొక్కలు నాటడం మాత్రమే.పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి మరియు కాలుష్యాన్ని నివారించడానికి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
వాతావరణ కాలుష్యం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి
వాతావరణ కాలుష్యం అనేది మనకు సాధారణంగా అనిపించినా దీని యొక్క పరిష్కారానికి మనకు దీర్ఘకాలిక సమయం పడుతుంది. సాధారణంగా ఒక మొక్కను చెట్టు గా ఎదిగేలా చేయడానికి నెలల సమయం సరిపోదు దానికి కొన్ని సంవత్సరాల తరబడి కాలం అవసరం.సాధారణంగా మనం వార్తల్లో వింటూనే ఉంటాము ఢిల్లీ, చండీగఢ్ ,హర్యానా వంటి రాష్ట్రాలలో విపరీతమైన విపరీతమైన వాతావరణ కాలుష్యం వలన అక్కడ ప్రజలు చాలా సమస్యలు ఇబ్బందులకు గురవుతున్నారు.అలాంటి సమస్యలు మన దగ్గర రాకుండా ఉండడానికి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
విరివిగా మొక్కలు నాటడం వలన ప్రస్తుత తరానికి భవిష్యత్తు తరాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ సమస్య పరిష్కారానికి ప్రతి పౌరుడు స్పందించి తన వంతు కృషి చేయాలి.ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రస్తుత తరానికి మరియు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం.
నాటిన మొక్కలను సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత.ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఎంతో పురోగతిని సాధించవచ్చు.
రైతుల సహకారంతో ముందుకు వెళ్లాలి.
సాధారణంగా వ్యవసాయ భూములు రైతుల వద్ద ఉంటాయి అందువలన వారికి పండ్ల మొక్కలు మరియు టేకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం వలన రైతులకు కూడా ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడతాయి.నగరాలు మరియు పట్టణాలలో నివసించే వారు వారికి వీలైనన్ని మొక్కలు రైతులకు డొనేట్ చేయడం వంటివి చేయాలి.ప్రతి ఇంటికి కనీసం నాలుగు రకాల పండ్ల మొక్కలు ఉచిత పంపిణీ చేయాలి.
రైతులకు పొలం గట్ల వెంట నాటుకోవడానికి టేకు మొక్కలు ఉచిత పంపిణీ చేయడం వల్ల రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది రైతుల వద్ద వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు మరియు నీటి కొరత గల ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలలో రైతులకు శుభా గల మొక్కలు మరియు జామాయిల్ మొక్కల పంపిణీ చేయడం ద్వారా అలాంటి బంజరు భూములను కూడా మనం వాడుకలోకి తీసుకురావచ్చు.
రైతులకు పొలం గట్ల వెంట నాటుకోవడానికి టేకు మొక్కలు ఉచిత పంపిణీ చేయడం వల్ల రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది రైతుల వద్ద వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు మరియు నీటి కొరత గల ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలలో రైతులకు శుభా గల మొక్కలు మరియు జామాయిల్ మొక్కల పంపిణీ చేయడం ద్వారా అలాంటి బంజరు భూములను కూడా మనం వాడుకలోకి తీసుకురావచ్చు.
పరిశ్రమల యజమానులు ఈ కార్యక్రమంలో తప్పక భాగస్వాములు కావాలి.
మానవ అవసరాలు తీర్చడంలో పరిశ్రమల పాత్ర ఎంతగానో ఉంది.ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో పరిశ్రమలు మన జీవితంలో ఒక భాగంగా ఉన్నాయి. వస్తు ఉత్పత్తి రంగం పరిశ్రమల యొక్క సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. వస్తు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కాలుష్యం నివారించడానికి మనం సామాజిక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
పారిశ్రామికవేత్తలను ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా కొంత ఆర్థిక సహాయం అందడం జరుగుతుంది ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు. హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం గా కొనసాగిస్తూ ఉండాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి