TRESS MANAGEMENT
(Copying with stress)
పరిస్థితులు మన చేయి దాటి పోయినప్పుడు మనం అనుభవించే సందర్భాన్ని స్ట్రెస్ అంటాం. సాధారణంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారు వారి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండగలరు. సాధారణంగా మనం వేటినైతే ప్రేమిస్తామో వాటిని మేనేజ్ చేయడానికి మనం ఇష్టపడతాం. ఉదాహరణకు కొన్ని సాధారణంగా మనం కుటుంబాన్ని మేనేజ్ చేస్తాం వ్యవసాయాన్ని మేనేజ్ చేస్తాం . మన చదువులు మన ఇష్టాలను అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉంటాం. మన యొక్క జాబ్ మన వ్యాపారాన్ని మనకిష్టమైన అన్నింటినీ మనం ప్రతిరోజు మేనేజ్ చేస్తూనే ఉంటాం. సాధారణంగా మనుషులు ఎవరు stress ప్రేమించరు కానీ దాన్ని కంట్రోల్ చేయడం అనేది అందరికీ తెలిసి ఉండాలి. మనం stress గురించి ఇంకా కొద్దిగా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
స్ట్రెస్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది
1 Positive stress2 Negative stress
Stress గురించి మనం ఒక ఉదాహరణ చూద్దాం.
ఒక అమ్మాయి అబ్బాయి తో తమ ప్రేమకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన అమ్మాయి కి ఎలాంటి tress ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి తన ఇష్టానుసారంగా చెప్పి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి ఎలాంటి స్ట్రెస్ అనేది లేదు కానీ ఆ రెండో వైపున ఆ అబ్బాయికి మాత్రం విపరీతమైన stress ఉంది. ఇలాంటి సందర్భం అనేది మన చేతిలో ఉండదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి జీవించాలని కోరుతూ అందుకోసం అని ఆ అమ్మాయి తన ఇష్టపూర్తిగా వెళ్ళిపోయింది. ఇలాంటి సందర్భంలో మీరు స్ట్రెస్ గా ఫీల్ అయితే ఇలాంటి సందర్భంలో స్ట్రెస్ ను పాజిటివ్గా తీసుకోవాలి లేకపోతే మీరు చాలా నష్టపోతారు.
ఇలాంటి సందర్భంలో మనం జీవితంలో కొత్త ఆప్షన్లని వెతుక్కోవాలి మన జీవితాన్ని బిజీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం బిజీగా ఉంచుకోవడం వలన స్ట్రెస్ అంతం అయిపోతుంది.
నిత్య జీవితంలో మనం స్ట్రెస్ ను ఎలా పొందుతూ ఉంటాం.
సాధారణంగా మనం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు స్ట్రెస్ కు గురిఅవుతూ ఉంటాం. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకు ఉంటాను సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణం ఇలాంటి విషయాన్ని కూడా మనం స్ట్రెస్ గా తీసుకోవడం అవసరం. ఏటీఎం దగ్గర లైన్ ఉన్నప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. అప్పుడు మనం స్ట్రెస్ను పాజిటివ్గా తీసుకోవాలి.
ఇలాంటి సందర్భాలు ఏవి మన ఆధీనంలో ఉండవు మన ఆధీనంలో ఉండని వాటి గురించి మనం stress గా ఫీలవడం అనవసరం. స్ట్రెస్ అనేది మనిషి జీవితం మొత్తం ఉంటూనే ఉంటుంది కానీ దాన్ని మేనేజ్ చేయడం అనేది తెలుసుకోవడం చాలా అవసరం.
స్ట్రెస్ను తగ్గించుకునే ఉపాయాలు( Tricks to Reduce Stress )
( 1 ) మానవ సంబంధాలను చక్కగా మేనేజ్ చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో మరియు తోటి సహ ఉద్యోగులతో అందరితో మంచి సంబంధాలను ఏర్పరుచుకోవాలి. దీనివలన స్ట్రెస్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
( 2 ) ప్రతి రోజు క్రమం తప్పకుండా అరగంట నుండి గంట వరకు వ్యాయామం ,యోగా చేయండి.
వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
( 3 ) మిమ్మల్ని మీరు ప్రకృతి తో అనుసంధానం చేసుకోండి. పచ్చటి పంట పొలాలు పార్కులు లేదా పూలతోటలు ఉద్యానవనాలు లాంటివి సందర్శిస్తూ ఉండాలి. ప్రకృతితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది.
(4) చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు ఆడుకోవడం లాంటివి చేయండి.
( 5 ) నీ సుఖదుఃఖాలను తోటి వారితో పంచుకోండి
తోటివారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి.
సాధారణంగా మనం ఎంత సంతోషంగా ఉంటే స్ట్రెస్ మనకు అంత దూరంగా ఉంటుంది.
( 6 ) శీతలపానీయాల వంటివి తాగడం తగ్గించండి మంచినీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి.
( 7 ) సాధారణంగా మీకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా అనిపించినప్పుడు లాంగ్ వాక్ అలాంటివి చేయండి.
( 8 ) ఆధ్యాత్మిక ప్రార్థనలు వంటివి చేయడం వలన చాలావరకు స్ట్రెస్ ను తగ్గిస్తుంది.
( 9 ) ఎప్పుడైనా మీకు స్ట్రెస్ గా ఉన్నప్పుడు నీకు నచ్చిన పని చేయండి ఉదాహరణకు మీకు సంగీతం ఇష్టమైతే సంగీతం వినడం లేదా సినిమా చూడడం ఇంకా ఏదైనా మీ అలవాటును బట్టి మీరు చేయాలి.
ఎందుకంటే మనకు నచ్చిన పని చేయడం ద్వారా స్ట్రెస్ నుండి రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాం.
( 10 )స్ట్రెస్ గా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. సరైన నిర్ణయాలు స్ట్రెస్ గా ఉన్నప్పుడు తీసుకోలేరు అలాంటి సమయంలో ఇంకా ఎక్కువ స్ట్రెస్ కు గురికావల్సి వస్తుంది.
(11) సాధారణంగా రెండు రకాలైన వ్యక్తులు స్ట్రెస్ బారిన ఎక్కువగా పడతారు. కన్ఫ్యూషన్ తో ఉండే వారు మరియు మొండి వారు ఎక్కువగా గురవుతుంటారు. కన్ఫ్యూషన్ తో ఉండే వారు నేర్చుకోవడం వలన స్ట్రెస్ ను తగ్గించుకోవచ్చు. మొండి వారు కాలానికి అనుగుణంగా మరియు పరిస్థితులకు అనుగుణంగా మారడం వలన స్ట్రెస్ ను తగ్గించుకోవచ్చు. కాలానుగుణంగా వచ్చే మార్పులను మీరు కూడా అంగీకరిస్తూ వాటితో మమేకమై కొనసాగుతూ ఉండాలి.
కొన్ని కొన్ని విషయాలలో ఎక్కువ రోజులు స్ట్రెస్ కు గురి అవుతుంటారు.
అలాంటి stress ఎక్కువ రోజులు అవకాశం ఇవ్వకండి అలాంటి వాటిని అన్నింటినీ అధిగమిస్తూ నీ జీవితంలో సుఖసంతోషాలను నింపుకుంటూ కొనసాగిస్తూ ఉండండి. స్ట్రెస్ మనకు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఉంటూనే ఉంటుంది. స్ట్రెస్ను ఎప్పుడూ పాజిటివ్ గా తీసుకొని ముందుకు సాగుతూ ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి