INDIAN AGRICULTURE SYSTEM
భారతదేశం ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం.ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ భూమి కలిగిన రెండో దేశంగా కూడా భారత దేశాన్ని
పేర్కొనవచ్చును.ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యధిక వ్యవసాయ భూమి కలిగిన దేశం భారతదేశం.భారతదేశ వ్యవసాయ రంగం ప్రస్తుత కాలంలో కూడా ఇంకా సాంప్రదాయక పద్ధతిలోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారు.భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.మన దేశ వ్యవసాయ రంగంలో ఇంకా పురాతన మరియు సంప్రదాయ పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేయడం జరుగుతుంది.పెరుగుతున్న జనాభాకు ఆహార ఉత్పత్తులను అందించడం లో వ్యవసాయరంగం విఫలం అవ్వకుండా తగిన విధంగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభా60 నుంచి 70 శాతం జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశ వ్యవసాయ రంగం పైనే ఉపాధికోసం ఆధారపడి ఉన్నారు.
స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా తక్కువగా ఉండవచ్చు కానీ అత్యధిక జనాభా కు ఉపాధి కల్పించడంలో వ్యవసాయరంగాన్ని దే పై చేయి.
![]() |
INDIAN AGRICULTURE |
భారత దేశ వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు
రైతులు అధిక దిగుబడులు సాధించాలంటేప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి.రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను సమకూర్చడం వంటివి చేయాలి.రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను సమకూర్చడం వంటివి చేయాలి.పురుగు మందులను సక్రమంగా వినియోగించుకునే పద్ధతులను గురించి రైతులకు వివరించాలి.నీటి వనరులను బట్టి నేల యొక్క స్వభావాన్ని బట్టి ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయని తెలియజేయాలి.నీటివనరులు తక్కువగా ఉన్న రైతులు వారు ఎలాంటి పంటలు వేసుకోవడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు వారికి వివరంగా తెలియజేయాలి.తక్కువ పెట్టుబడి తో ఎక్కువ దిగుబడులు సాధించే మార్గం వైపు రైతులను నడిపించాలి. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఏ ఉత్పత్తులకు ఎంత విలువ ఉందో రైతులకు అవగాహన కల్పించాలి.దేశంలో ఆహార ఉత్పత్తులు కొరత లేకుండా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలి పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి.
![]() |
south indian agriculture |
రైతులలో రావాల్సిన మార్పులు
భారత దేశ వ్యవసాయరంగం ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ రంగం ఉత్పత్తులను ఉత్పత్తి చేసే దేశం.మన రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మరింత అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది.రైతులు వాతావరణ అనుకూలతను బట్టి పంటలు వేయడం తెలుసుకోవాలిమార్కెట్ పైన కూడా అవగాహన పెంచుకోవాలి.వ్యవసాయరంగ అధికారులను సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోవాలిపంటలను వేసే విధానం వాటికి సంబంధించిన జాగ్రత్తల గురించి వారు వివరిస్తారు.రైతుల కోసం వ్యవసాయ రంగ అధికారులను ప్రభుత్వం నియమించింది వారి సేవలను రైతులు ఉపయోగించుకోవాల్సి అవసరం ఎంతో ఉంది.
![]() |
PROFITABLE CORN CROP |
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేయవలసిన పనులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది .సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం.నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి.ఎందుకంటే నకిలీ విత్తనాలు ప్రభావం దిగుబడులపై చాలా చూపుతుంది.అందువలన రైతులు తీవ్రంగా నష్టపోతారు.పంట రుణాలను జాప్యం లేకుండా త్వరగా మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి.పంట రుణాలను జాప్యం లేకుండా త్వరగా మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలిపంట రుణాలను జాప్యం లేకుండా త్వరగా మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలిపంట రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ నెలల తరబడి తిరగడం వలన సరైన సమయంలో పంటలు వేయకపోవడం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడులు లేక ఇబ్బందులకు గురవుతుంటారు.సకాలంలో ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడడంనాణ్యమైన పురుగు మందులు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకోవడంవంటివి ప్రభుత్వం చేయాలి.వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీలు త్వరగా అందజేయడం చేయాలి.డ్రిప్ సిస్టం కు అప్లై చేసిన రైతులకు నెలల తరబడి ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయడం చేయాలి.ఎందుకంటే డ్రిప్ సిస్టం ద్వారా రైతులు తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడులు సాధించడానికి వీలవుతుంది.
పంటలకు సరైన మద్దతు ధరలు కల్పించడం
ప్రభుత్వం రైతులకు పండించిన పంటకు సరైన మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి.రైతులకు మద్దతు ధర కల్పించడం వలన ప్రోత్సాహకరంగా ఉంటుందిదాని వలన రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు.దళారుల ప్రమేయం ఉండకుండా చూడాలి
పంటలు నిల్వ చేయడానికి శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి
రైతులకు వారు పండించిన పంటలను గిట్టుబాటు ధరలు వచ్చేవరకు నిల్వ చేయడానికి తగిన శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి.శీతల గిడ్డంగుల వలన రైతులు తమకు గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత సరుకును అమ్ముకోవడం వలన వారు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటుచేసిన శీతల గిడ్డంగుల వలన పంట యొక్క నాణ్యత కోల్పోకుండా ఉండడం జరుగుతుంది.అందువలన సరుకును ఎక్కువ రోజులు నిలువ చేసుకోవడానికి వీలు ఉంటుంది.విదేశాలకు ఎగుమతి చేసే సరుకుల్లో నాణ్యత లోపించకుండా ఉండడం జరుగుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి