HELOBUJJI

this website brings you ,Indian culture,news,computer education,film news,job notifications,agriculture,auto mobiles,tech news,shops information,sports,India tourism,economy,business,motivational stories, g k questions, health,fashion,life style,love stories,foreign policy,social life, technology,online business,digital market,new govt vacancy,competition exams,current affairs,national news, ,traditions, life style, earn money,,all study materials,tax,arts,nature,latest news,youth life,,army ,

Breaking

11, డిసెంబర్ 2019, బుధవారం

TELANGANA GDP



TELANGANA GDP



తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 లో ఏర్పడిన రాష్ట్రం. ఒక లక్ష 12077  వేల వర్గ కిలోమీటర్లు కలిగిన భూభాగం తెలంగాణ రాష్ట్రం యొక్క సొంతం వ్యవసాయానికి చక్కటి అనుకూలమైన భూభాగం కలిగిన రాష్ట్రం సమతుల్య వాతావరణం కలిగిన రాష్ట్రం నాలుగు కోట్ల పైచిలుకు జనాభా కలిగిన రాష్ట్రం 300 పైచిలుకు ఇంజనీరింగ్ కాలేజీలు కలిగి ఉన్న రాష్ట్రం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వనరులు తెలంగాణ రాష్ట్రం యొక్క సొంతం తెలంగాణ రాష్ట్రం యొక్క జిడిపి 120 బిలియన్ డాలర్లు జీడీపీ మరీ ఇంత తక్కువ ఉండటానికి గల కారణాలు కొన్ని మనం చూద్దాం



తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ విద్యా విధానం




తెలంగాణ రాష్ట్రంలో 300 పైచిలుకు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఉన్నాయి వాటిలో లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పట్టాలు తీసుకోవడం జరుగుతుంది ఇంజనీరింగ్ పట్టా పొంది అనేక ప్రైవేటు సంస్థల్లో మరియు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందలేక పోతున్నారు ఇంజనీరింగ్ చదివి కూడా ఐదు పది వేలు ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు పడుతున్న సమయం ఇది డాటా ఎంట్రీ జాబ్ లకు పోస్ట్ ఆఫీస్ జాబు లకు మరియు కంప్యూటర్ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు రిసెప్షనిస్ట్ ఉద్యోగాలకు క్యూలో నిలబడుతున్నారు ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న ఏ విద్యార్థి తన సొంత స్టార్టప్ మొదలు పెట్టలేక పోతున్నాడు ఏ ఇంజనీరింగ్ విద్యార్థి కూడా జాబ్స్ క్రియేట్ చేయలేకపోతున్నాడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు లక్షల్లో పట్టాలు పొందుతున్నారు అని బయటకు చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది పోటీ ప్రపంచంలో వారు సబ్జెక్టు అవగాహన లేక వెనుకబడి పోతున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి ఏ దేశం కూడా దేశంలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి వారి నైపుణ్యాన్ని మెరుగు పరిచే వారి సొంత ఉపాధి అవకాశాల కల్పన కోసం అడుగులు వేసే దిశగా వారిని ప్రోత్సహించాలి


ఇజ్రాయిల్ దేశం యొక్క gdp




ఇజ్రాయిల్ ఈ దేశం పేరు మనందరికీ తెలిసిందే మన మీడియాలో ప్రతిసారి ఈ దేశం గురించి గొప్పగా చెప్పటం మనం వింటూనే ఉంటాం ఇజ్రాయిల్ యొక్క భూభాగం 22వేల 72 వర్గ కిలోమీటర్లు జనాభా 87 లక్షలకు పైచిలుకు మాత్రమే ఈ దేశం యొక్క gdp 277 బిలియన్ డాలర్లు తెలంగాణ రాష్ట్రంలో నాలుగో వంతు కూడా లేని ఈ దేశం ఇంత అభివృద్ధికి కారణం ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు టెక్నాలజీని ఎగుమతి చేయడం ఈ దేశం యొక్క ప్రత్యేకతలు చెప్పుకోదగ్గ వ్యవసాయ భూమి కూడా లేని ఈ దేశం సహజ వనరులు చాలా తక్కువగా ఉన్న దేశం అం అయినా సరే అలాంటి ప్రతికూలతలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ అధిగమించి అభివృద్ధి చెందిన దేశంగా నిలబడింది ఈ విషయం ప్రజలు ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉంది సువిశాల భారతదేశం 130 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన దేశానికి ఈ దేశం ఆయుధాలు మరియు టెక్నాలజీని ఎగుమతి చేస్తుంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అర్థం చేసుకోవచ్చు వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ మరియు డ్రిప్ ఇరిగేషన్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇది తెలంగాణ రాష్ట్రం ఇంత చిన్నపాటి దేశం తో పోటీ పడలేకపోతుంది మానవ వనరులను భారతదేశం మరియు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో 60 శాతానికి పైచిలుకు యువత నం కలిగి ఉంది ప్రభుత్వాలు యువతను వినియోగించుకోవడంలో ప్రణాళికలు రచించడంలో ఘోరంగా విఫలం అవుతుంది తెలంగాణ లో చదివే ఇంజనీరింగ్ విద్యార్థులు బాహ్య ప్రపంచానికి పోటీ ఇవ్వడంలో విఫలమవుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు


వ్యవసాయరంగ ఆధునికీకరణ



TELANGANA-GDP, TELANGANA BUDGET
TELANGANA AGRICULTURE 

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం జరగడం లేదు వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం యంత్ర పరికరాలను రైతులకు అందజేయడం సకాలంలో విత్తనాలు ఎరువులు ఉండేలా చూడడం చేయలేకపోతున్నారు వ్యవసాయ రంగంపై ఆధారపడే సంఖ్యను తగ్గించడం మరియు ఉత్పత్తి మరియు సేవా రంగాలపై దృష్టి సారించడం వలన మన ఆర్థిక పరిస్థితిని మెరుగు పడటానికి అవకాశాలు ఉంటాయి వ్యవసాయంలో ఎంట్రీ కరుణ వలన సమయం ఆదా అవడం మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం వంటివి జరుగుతాయి ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ భూమి కలిగిన అమెరికా వంటి దేశాలు కూడా ఆధునికీకరణ వరణం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది మానవ వనరులను వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాలకు మరణించినప్పుడు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది వ్యవసాయ ఆధునికీకరణ ద్వారా పెరిగిన ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉంటాయి


యువతలో మార్పు రావాలి




చాలా మంది యువత చదువుకునే వయసులో చదువును నిర్లక్ష్యం చేయడం ఆ తర్వాత నిరుద్యోగ బారిన పడటం జరుగుతుంది మరియు అనేక మంది విద్యార్థులు మార్కుల కోసం సర్టిఫికెట్స్  కోసం మాత్రమే చదువుతున్నారు ఈ విధానానికి స్వస్తి చెప్పి ఏ విద్యార్థి అయినా వారు చదివే సబ్జెక్ట్స్ పైన అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం మరియు వాటిని వాస్తవిక జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి
















1 కామెంట్‌:

  1. If eager on|you like} Jackpot slots games, we've got loads of these too. Try your luck enjoying in} Caishenas Gold, Who Spunit and Crazy Jewels, and see whether 1xbet or not you can to|you possibly can} stroll away with one of many prime cash payouts. This is the a part of} net site} that draws the high-stakes players and anybody who likes a high degree of threat served up with their slots.

    రిప్లయితొలగించండి