HELOBUJJI

this website brings you ,Indian culture,news,computer education,film news,job notifications,agriculture,auto mobiles,tech news,shops information,sports,India tourism,economy,business,motivational stories, g k questions, health,fashion,life style,love stories,foreign policy,social life, technology,online business,digital market,new govt vacancy,competition exams,current affairs,national news, ,traditions, life style, earn money,,all study materials,tax,arts,nature,latest news,youth life,,army ,

Breaking

10, మే 2023, బుధవారం

మే 10, 2023

టైం మానేజ్మెంట్ టిప్స్ తెలుగులో - Time Management Tips in Telugu



టైం మానేజ్మెంట్ టిప్స్ తెలుగులో - Effective Time Management Tips In Telugu 

జీవితంలో సమయానికి ఎవరైతే విలువనిస్తారో సమయాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో ఎవరైతే సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారో వారు జీవితంలో గొప్ప ఎదుగుదలను చూస్తారు. ఎందుకంటే చాలామంది తమ సమయాన్ని సరిగా వినియోగించుకోలేక పోయి విఫలం అవుతారు. నిజంగా మీరు మీ జీవితంలో ఎదగాలనుకుంటే తప్పకుండా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి ప్రణాళిక బద్ధంగా సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా చేయవలసిన పనులను సరైన సమయంలో పూర్తి చేయగలరు. మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో సిద్ధహస్తులుగా తయారవ్వండి సమయాన్ని మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోండి. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఉండవలసిన మొదటి లక్షణం సమయపాలన. ఎంతోమంది విజయవంతమైన వ్యక్తుల జీవితాలను క్షుణ్ణంగా చదవండి వారు సమయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని ప్రతి గంటని ప్రతిరోజు నీ నీరు ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టే మీ జీవితం యొక్క ఎదుగుదల ఉంటుంది. ప్రతి నిమిషం ఎంతో విలువైనది కోల్పోయిన తర్వాత తిరిగి పొందలేము


సమయ నిర్వహణ అనేది మన దైనందిన జీవితంలో ముఖ్యమైన అంశమని మనందరికీ తెలుసు. మీరు విద్యార్థులు ఉద్యోగులు లేదా సొంత వ్యాపారం కలిగిన వారు లేదా వ్యవస్థాపకులు అయినా అయి ఉండవచ్చు. మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి మరియు మీ యొక్క ఉత్పాదకతను పెంచుకోవడానికి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది కీలకమైన అంశం. మీయొక్క సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి దిగువన కొన్ని చిట్కాలు ఇవ్వడం జరిగింది. ఈ చిట్కాలను అమలు చేయడం ద్వారా మీరు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది

Time Management Tips in Telugu



 షెడ్యూల్ ను రూపొందించుకోవడం చాలా ముఖ్యం

చాలామంది సమయాన్ని షెడ్యూల్ రూపొందించుకోకుండా ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవడానికి కష్టమవుతుంది షెడ్యూల్ రూపొందించడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను సరైన సమయంలో పూర్తి చేయవచ్చు. షెడ్యూల్ అనేది మీరు సరైన విధంగా మీ యొక్క పనులను ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించి ఆ కేటాయించిన సమయంలో ఆ పని పూర్తయ్యే విధంగా చూసుకోండి.

 మీ యొక్క పనులకు ఆటంకం కలిగించే వాటిని దూరం పెట్టండి

చాలామంది వారు చేయవలసిన పనులను పక్కనపెట్టి వారికి ఉపయోగపడే పనులను పట్టించుకోకుండా పరధ్యానంలో ఉండిపోతారు. సోషల్ మీడియా ఈ మెయిల్స్ ఫోన్ కాల్స్ వాట్సాప్ నోటిఫికేషన్లు అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని వారి పని పైన ఉండే ఏకాగ్రతను భంగం కలిగించడానికి ఇలా చాలా ఉపకరణాలు ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగులు వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరు మీ యొక్క సమయాన్ని మీ దృష్టి మరల్చకుండా నీకోసం ఉపయోగించుకోండి. మీ యొక్క ఏకాగ్రతను భంగం కలిగించే వాటిని వీలైనంత దూరం పెట్టడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు కొంత అభివృద్ధి సాధించగలరు ప్రశాంతమైన వాతావరణంలో పని చేయండి మీరు ఏ పని నైనా ఏకాగ్రతతో చేస్తే ఆ పనిలో ఎంతో అభివృద్ధి చెందుతారు.


మల్టీ టాస్కింగ్లతో సతమతం అవ్వకండి

కొందరు తలకు మించిన భారాలను నెత్తిన వేసుకుంటారు. ఒకే సమయంలో ఒకే పని కాకుండా అనేక పనులను ఒకేసారి చేయడానికి సిద్ధపడతారు. దీని ద్వారా ఏ ఒక్క పనిని సక్రమంగా నిర్వర్తించలేరు దాని ద్వారా మీ యొక్క ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక పనిని పూర్తి చేసిన తర్వాతనే మరొక పనిని మొదలుపెట్టండి. ఎందుకంటే ఏ ఒక్క పని పైన మీరు సరైన దృష్టి పెట్టలేరు సక్రమంగా నిర్వర్తించలేరు ఇలా చేయడం వలన మీరు అనుకున్న అభివృద్ధిని సాధించలేరు. మల్టీ టాస్టింగ్ అనేది మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది ఒక పని పూర్తి అవ్వకుండానే మరొక పని మొదలు పెడతారు చాలామంది ఇలా మీరు మాత్రం ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మల్టీ టాస్టింగ్ వలన ఎన్నో లోపాలు తలెత్తుతాయి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

 ప్రతి పనికి పూర్తి కావడానికి కావలసినంత సమయాన్ని కేటాయించండి

ఒక పని పూర్తి పూర్తి అవ్వడానికి ఆ పనికి కావలసిన సమయాన్ని కూడా కేటాయించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక పని పక్కా ప్రణాళికతో కావలసినంత సమయం కేటాయించండి తొందరపాటుతనం అనేది పనికిరాదు. అలాగని ఆ యొక్క పనికి కావాల్సినంత సమయం కంటే ఎక్కువ సమయం కూడా కేటాయించకూడదు. ఏ పనైనా సరైన సమయంలో సరైన సమయం తీసుకుని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు చేసే పనిలో నాణ్యత ఉంటుంది ఏకాగ్రతతో పని కూడా చేయగలరు మీయొక్క టైం మేనేజ్మెంట్లో  ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు.


కొంత సమయం విరామం తీసుకోండి ఆరోగ్యం పైన జాగ్రత్త వహించండి

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఏ పనైనా చేయగలం. ప్రతి రంగంలోని వారికి వారి వారి పనుల వలన మానసిక ఒత్తిడి మరియు శారీరక అలసట అనేది సహజం. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు మన పనుల నుండి విరామం తీసుకోవడం కూడా అవసరం. ఈ యొక్క విరామం సమయంలో మీకు నచ్చిన పనులను చేయండి దీని ద్వారా మీరు తిరిగి పని మొదలుపెట్టినప్పుడు మరింత ఉత్సాహంగా ఆ పనిని పూర్తి చేయగలరు. మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామం కూడా కేటాయించండి చాలామంది రాత్రిపూట నిద్రకు సరైన సమయం కేటాయించకుండా టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. దీని ద్వారా సరైన విశ్రాంతి లేక మరుసటి రోజు ఉత్సాహంగా మీ యొక్క పనులను చేసుకోలేరు.

 మీ యొక్క పనులకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి


ఆధునిక ప్రపంచం పోటీ ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో అవసరమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టుకోవాలి. అనవసరమైన విషయాలు ఆలోచించడం కానీ లేదా అనవసరమైన విషయాలపై ఇతరులతో వాదనలు చేస్తూ సంభాషణలు చేస్తూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క టైం మేనేజ్మెంట్ను సరిగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మీరు మీ పనుల పైన మాత్రమే శ్రద్ధ వహించండి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ యొక్క జీవిత ఆశయాలను మరియు మీ యొక్క అభివృద్ధికి తోడ్పడే విషయాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అటువంటి పనులకు ఇవ్వడం ద్వారా మీరు మరింత అభివృద్ధిని పొందవచ్చు.



 ప్రతిరోజు కొంత సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి కేటాయించండి


ఆధునిక ప్రపంచం అత్యంత వేగంగా మార్పులు చెందుతూ వస్తుంది. చెందుతున్న మార్పులపై కొంత అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎందుకంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మిమ్మల్ని మీరు అప్డేటెడ్ గా ఉంచుకోండి ప్రపంచ పోకడలపై అవగాహన పెంచుకోండి. నీ జీవితానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా విద్యను మరే ఇతర అంశాలనైనా నేర్చుకుంటూనే ఉండండి నిత్యం.


ఈ యొక్క టైం మేనేజ్మెంట్ టిప్స్ ను మీరు మీ జీవితంలో ఉపయోగించడం ద్వారా మారింత అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. సమయంతో పాటు సమానంగా పరిగెడుతూ అభివృద్ధి చెందుతూ ఉండడానికి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ టిప్స్ మీ జీవిత ఎదుగుదలకు ఎంతో సహకరిస్తాయి. అందుకే సమయం యొక్క విలువ మన అందరం అర్థం చేసుకొని మన జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి సహకార పడతాయి.






27, మే 2022, శుక్రవారం

మే 27, 2022

HOW TO CREATE YOUTUBE CHANNEL IN 2022

 HOW TO CREATE YOUTUBE CHANNEL IN 2022

              ఆన్లైన్ ప్లాట్ ఫాం లో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు   ఉన్నాయి. అందులో ప్రధానంగా యూట్యూబ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయ్యాక క్రియేటర్స్ కు ఆదాయం అనేది ఇది మొదలవుతుంది. మానిటైజేషన్ అయ్యాక అనేక విధాలుగా డబ్బు సంపాదించడానికి కి మార్గాలు ఏర్పడుతాయి . మీలో  ఉన్న టాలెంటును ప్రపంచం ముందు ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు .  

మీలో ఉన్న కళలను నైపుణ్యాలను క్రెటివిటీని ప్రపంచానికి చూపుతూ డబ్బును ఆర్జించడానికి చక్కటి అవకాశాన్ని యూట్యూబ్ ప్రపంచానికి మరియు  క్రీటర్లకు అందరికి  అందిస్తుందనే చెప్పుకోవచ్చు .

How to create youtube channel in 2022, how to earn money from youtube

how many category in youtube 

యూట్యూబ్ లో అనేక రకాలైన కేటగిరి చానల్స్ ను క్రియేట్ చేయవచ్చు నీలో ఉన్న క్రియేటివిటీకి అనుగుణంగా మీయొక్క కేటగిరి ని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది

1) cars and vehicles   

2) Comedy 

 3) Education

  4)  entertainment

 5)  film and Animation 

 6)  Gaming  

 7)  How to and Style  

8)  Music  

9) News and Politics 

 10)  Non profits and Activism 

 11)  People and Blogs 

 12)  Pets and Animals

  13)  Science and Technology 

 14) Sports  

15)  Travel and Events    

మీకు  నైపుణ్యం ఉన్న category లో  వీడియోలను రూపొందించవచ్చు . 

యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలామంది యూట్యూబ్ క్రియేటర్ లు ఇతరుల యొక్క కంటెంట్ను కాపీ చేసి వారి చానల్లో అప్లోడ్ చేయడం చేస్తారు ఇలాంటి పద్ధతి సరైనది కాదు మీ సొంత కంటెంట్ ను క్రియేట్ చేయండి మీకు నైపుణ్యం ఉన్న రంగంలో దానికి సంబంధించిన వీడియోలను చేయడం వలన మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందవచ్చును ఇతరుల యొక్క కంటెంట్ను మీరు వినియోగించడం వలన మీరు కాపీరైట్ ఉల్లంఘన చేసినట్లు అవుతుంది మీయొక్క ఛానల్కు 3 కాపీరైట్ స్ట్రైక్ లు వస్తే ఛానల్ ను యూట్యూబ్ డిలీట్ చేయడం జరుగుతుంది అందువలన మీరు ఇతరుల యొక్క కంటెంట్ను ఉపయోగించకుండా నీ యొక్క సొంత వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయండి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో నీకు కావలసిన కాపీరైటు ఫ్రీ మ్యూజిక్ పొందవచ్చును మీ యొక్క వీడియోల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం 


యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు



నీ యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు ముఖ్యంగా యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ ను పాటించాలి మరియు మీయొక్క ఛానల్ చందాదారులు వెయ్యి మంది అయి ఉండాలి మరియు నాలుగువేల గంటల వాచ్ టైం ఉండాలి ఈ యొక్క 1000 మంది చందాదారులు మరియు నాలుగు వేల గంటలు వాచ్ టైం గత 365 రోజుల లోపల పూర్తి చేసి ఉండాలి మరియు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆల్ మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసి ఉండాలి మరియు నీ యొక్క జిమెయిల్ టు స్టెప్ వెరిఫికేషన్ తప్పక ఆన్ చేసి ఉండాలి మీయొక్క ఛానల్ పైన కమ్యూనిటీ గైడ్లైన్స్ వై లెసన్ ఉండకుండా చూసుకోండి చానల్ మానిటైజేషన్ అప్లై చేయడానికి నీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి ఈ యొక్క అర్హతలు అన్నీ మీకు ఉంటే మీరు మానిటైజేషన్ కు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్ లో ఉండకుండా చూసుకోండి ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ లో మూడు మీ ఛానల్ పైన ఉన్నాయంటే మీ ఛానల్ యూట్యూబ్ తొలగించడం జరుగుతుంది. 

యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం వలన కలిగే లాభాలు

మీయొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం ఒక తెలివైన పని అని చెప్పుకోవచ్చు మహిళలకు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఖాళీ సమయాల్లో టీవీ సీరియల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం కంటే నీకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో నీకు వచ్చిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు కుకింగ్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ tech వీడియోస్ కూడా చేయవచ్చు డైలీ రొటీన్ బ్లాక్ కూడా చేసి అప్ లోడ్ చేయడానికి అవకాశం ఉంది మానిటైజేషన్ అయ్యాక నీకు సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అనేక బ్రాండ్స్ మరియు కంపెనీలు వారి యొక్క ఉత్పత్తులను ప్రమోషన్ చేయడం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు పెయిడ్ ప్రమోషన్స్ వలన మీరు చాలా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మరియు ఇతరుల యొక్క యూట్యూబ్ ఛానల్స్ ను మరియు ఫేస్బుక్కు పేజీలను ఇంస్టాగ్రామ్ పేజీ లను ప్రమోట్ చేస్తూ కూడా చాలా డబ్బు సంపాదించవచ్చు దీనితో పాటు నీకు సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటిని కూడా సేల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది వీడియోస్ యొక్క ఎడిటింగ్ కు సంబంధించిన అవగాహన కొంతవరకు ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగే ఆకర్షణీయమైన కూడా క్రియేట్ చేయడం నేర్చుకొని ఉండాలి క్లిక్ బైట్ అనేది చేయకుండా ఉండం 

Travel vlogs చేయండి

చాలామందికి ప్రయాణాలు చేయడం మరియు వివిధ పుణ్యక్షేత్రాలు టూరిస్ట్ ప్లేసులు సందర్శించుకోవడం కొంతమందికి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాల నే మీ ప్రొఫెషన్ లా కూడా ఎంచుకోవచ్చు ప్రస్తుత కాలంలో ట్రావెల్ బ్లాగర్స్ కూడా ఎంతో పేరును మరియు డబ్బు సంపాదించారు నీ యొక్క ట్రావెల్ vlogs ఇతర ప్రొడక్ట్స్ యొక్క పేయిడ్ ప్రమోషన్స్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు వివిధ ప్రదేశాలతో మీరు దర్శించుకుంటూ ప్రపంచానికి ఆ ప్రదేశాల యొక్క గొప్పతనం మరియు దాని చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తూ మీ యొక్క ప్రయాణాలను కొనసాగిస్తూ ఉండవచ్చ మీరు వివిధ ప్రదేశాలను దర్శించుకునే సమయంలో ఆ ప్రదేశాలలోని హోటల్స్ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు మీ ప్రయాణాలతో డబ్బులు సంపాదించవచ్చు

How to create youtube channel in telugu, travel vlogs in telugu


టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ వీడియోస్ చేయండి

ప్రస్తుత కాలం టెక్నాలజీ తో కూడుకున్నది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకవేళ మీలో టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నట్లయితే ఆ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ మీరు కూడా ప్రాచుర్యం పొందవచ్చు ఒకవేళ మీలో ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్నట్లయితే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం ద్వారా కూడా మీరు ప్రపంచాన్ని ఆకర్షణ మీయొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించవచ్చు టెక్నాలజీ వీడియోస్ లో అనేక ప్రొడక్ట్స్ యొక్క రివ్యూలను ఇవ్వవచ్చు మరియు ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించిన లేదా ఒక సాఫ్ట్వేర్ కు సంబంధించిన ట్యుటోరియల్స్ ను కూడా ప్రపంచానికి అందించవచ్చు ప్రస్తుత కాలంలో చాలా మంది యువత టేక్ రివ్యూల ద్వారా చాలా ప్రాచుర్యం లోకి వచ్చారు మరికొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా జనం యొక్క పొందుతున్నారు ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం యూట్యూబ్ పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది యూట్యూబ్ ప్లాట్ఫాం ద్వారా అనేక రకాలైన కోర్సులను ఉచితంగా నేర్చుకో గలుగుతున్నారు మరియు వాటిలో ప్రావీణ్యం సంపాదించి వారి జీవనోపాధికి కూడా ఏర్పరచుకుంటున్నారు

డైలీ  vlogs మరియు cooking వీడియోస్ చేయండి

Daily vlogs and cooking videos, how to create youtube channel in 2022


మీరు గృహిణులు అయితే నీకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మీయొక్క ఖాళీ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు నీకు వంట చేయడంలో నైపుణ్యం ఉన్నట్లయితే ఒక కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో మీకు వచ్చిన వంటలను అందరితో షేర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు











































8, ఆగస్టు 2020, శనివారం

ఆగస్టు 08, 2020

KIRANBEDI BIOGRAPHY IN TELUGU





KIRANBEDI BIOGRAPHY IN TELUGU

అది 1972వ సంవత్సరం భారత హోం మంత్రిత్వ శాఖ మరియు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ సర్వీస్ లో అనుకోకుండా ఒక ఉప్పెన వచ్చింది ఈ యొక్క ఉప్పెన కు కారణం 5 అడుగుల 6 అంగుళాల ఒక 23 సంవత్సరాల అమ్మాయి ఇండియన్ పోలీస్ సర్వీస్ లో మొట్టమొదటి సారిగా ఈ సంఘటన చోటు చేసుకుంది ఒక అమ్మాయి ఐపీఎస్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం ఎవరూ కోరుకోవడం లేదు ఈ అమ్మాయి ఐపీఎస్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలి అని అప్పుడున్న సమయం ఎలాంటిదంటే పోలీస్ అంటే మగవారు మాత్రమే అని అనుకునేవారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆడవారి కోసం ఎలాంటి స్థానం లేదు ఆ సమయంలో ఈ అమ్మాయి తన అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత తనతో పనిచేసే వారు సీనియర్ అధికారులు మరియు జూనియర్స్ కూడా అ ఓ అమ్మాయి ఓ అమ్మాయి అంటూ పిలిచేవారు ఈ ఒక్క మహిళా అధికారికి సరైన గౌరవం దక్కడం లేదు అది ఎలాంటి గౌరవం అంటే ఒక ఐపీఎస్ అధికారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు పురుష ఐపీఎస్ అధికారులకు లభించే గౌరవం ఆమెకు ఎవరు ఇచ్చేవారు కాదు కానీ ఈ అమ్మాయి ఆ గౌరవాన్ని తీసుకోవడానికి లా కోడానికి ప్రయత్నం చేయలేదు ఆ గౌరవాన్ని సంపాదించాలని కోరుకుంది తనతో పనిచేసే పురుషుల ఎదురుగా మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి వెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడడం కత్తులతో తల్వార్లతో రోడ్లపై ధర్నా చేసే మూక లకు తన లాఠీతో సమాధానం చెప్పడం ఈ యొక్క మహిళా అధికారి చూపించిన తెగువ ఎవరూ మరచిపోరు ఈ మహిళా అధికారికి చట్టం మరియు విధి మాత్రమే తెలుసు ఆరు నెలల తర్వాత అమ్మాయి అని పిలిచిన అధికారులే మేడం అని పిలవడం మొదలుపెట్టారు సార్ అని పిలవడం మొదలుపెట్టారు సార్ కిరణ్ బేడి ఐపీఎస్







కిరణ్ బేడీ అమృత్ సర్ లోని ఒక వ్యాపార కుటుంబంలో జన్మించింది ప్రకాష్ lal పెషావర్ ప్రేమ్ లతా యొక్క రెండవ సంతానం కిరణ్ బేడి తండ్రికి టెన్నిస్ పై చాలా మక్కువ ఉండేది అందుకే కిరణ్ కూడా చిన్నప్పటినుండి టెన్నిస్ ఆడటం మొదలు పెట్టింది మరియు జాతీయ స్థాయి వరకు ఆడడం జరిగింది కిరణ్ బేడీ సర్వీస్ క్లబ్ లోకి వెళుతూ ఉండేది ఆ సమయంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కలిసి ఉండేది అదే సమయంలో తప్పక ఇస్తాను అని నిర్ణయించుకుంది 80 మంది కలిగిన బ్యాచ్లో ఒకే ఒక మహిళ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 1975లో ఢిల్లీలోని chanakyapuri లో మొదటి పోస్టింగ్ తీసుకుంది ఇదే సంవత్సరం పబ్లిక్ డే పరేడ్లో పురుషుల టీంకు నేతృత్వం వహించిన నా మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి గా పేరుగాంచింది ఇదే సంవత్సరం ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది 1978 సంవత్సరంలో ఇండియా గేట్ దగ్గర అకాలీదళ్ వారు తల్వార్లతో నడిరోడ్డుపై నిరసన చేస్తున్న వారిని తన లాఠీతో కంట్రోల్ చేయగలిగింది ఈ ఒక్క ధైర్యసాహసాలకు మెచ్చి 1980 సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్ మెడల్ అందుకుంది chanakyapuri తర్వాత మరో జిల్లాకు బదిలీ చేయడం జరిగింది ఆ యొక్క జిల్లాలో అవసరమైన పోలీస్ ఫోర్స్ లేకపోవడంతో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించడానికి యువత నం భర్తీ చేయడం ప్రారంభించింది తద్వారా కేవలం మూడు నెలల్లో ఢిల్లీలోని ప్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది అందులో అక్రమ మద్యం వ్యాపారం కూడా ఉంది మహిళలను టీచింగ్ చేయడం కూడా గణనీయంగా తగ్గడం జరిగింది కానీ కిరణ్ బేడీ చేసిన ఈ పని కొంతమంది నేతలు వ్యాపారస్తులు జీర్ణించుకోలేకపోయారు దీని ఫలితంగా 1981 సంవత్సరంలో సివిల్ పోలీస్ నుండి ట్రాఫిక్ పోలీస్ డిసిపిగా మార్చారు 1982లో జరిగే ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ఢిల్లీలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉండేది 15 కంటే ఎక్కువ స్టేడియాలు కొన్ని బ్రిడ్జిలు కూడా నిర్వహిస్తున్నారు ఈ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి కిరణ్ బేడి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి అక్కడికక్కడే jurmana విధించడం మొదలుపెట్టింది అదే క్రమంలో 1982 ఆగస్టులో ఒక అంబాసిడర్ కారు మార్కెట్ లో నియమాలు ఉల్లంఘించి పార్కింగ్ చేయడం జరిగింది కిరణ్ బేడీ కి రిపోర్టు చేసే సబ్ ఇన్స్పెక్టర్ కారును క్రేన్ తో లాక్ వెళ్లడంలకు వెళ్ళడం జరిగింది అప్పుడే అసలైన ప్రాబ్లం మొదలైంది ఆ యొక్క అంబాసిడర్ కారు ఎక్కడిదో కాదు ప్రధానమంత్రి ఇ ఆఫీస్ కు సంబంధించిన కారు ఈ సంఘటన తర్వాత ఎస్సై నిర్మల్ సింగ్ ను ట్రాన్స్ఫర్ లేదా సస్పెండ్ చేయాలని ఒత్తిడి పెరిగింది కానీ కిరణ్ మాత్రం తన కింద పనిచేసే ఎస్సై కి పూర్తి మద్దతు గా నిలుస్తుంది కిరణ్ బేడీ తన సీనియర్ అధికారులకు గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఎస్సై నిర్మల్ సింగం సస్పెండ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసినట్లయితే నేను నా రిజైన్ లెటర్ ఇస్తానని చెప్పడం జరిగింది మీడియా వాళ్లు కిరణ్ బేడీని కారు క్రేన్ తో తీసుకు వెళ్లడం వలన కిరణ్ బేడి ని కాస్త క్రేన్ బేడీ అని పిలవడం మొదలుపెట్టారు
కిరణ్ బేడీ ఒక రోజు డ్యూటీ సమయంలో ఇందిరాగాంధీ యోగా గురువైన ధీరేంద్ర బ్రహ్మచారి యొక్క కారుకు నో పార్కింగ్ చలాన్ రాయడం జరుగుతుంది దీనివలన ఇందిరాగాంధీ కోపం పంచుకోవడం జరిగింది ఇదే ఇందిరాగాంధీ 1975లో ప్రథమ మహిళ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్ బేడీని తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించింది అలాంటి ఇందిరాగాంధీ కిరణ్ బేడీ కి పనిష్మెంట్ ఇవ్వడానికి తయారయింది కిరణ్ బేడి ని సమయం కంటే ముందే ఢిల్లీ నుండి గోవాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇదే సమయంలో కిరణ్ బేడి యొక్క ఏడు సంవత్సరాల కూతురు అనారోగ్యంతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సందర్భం అనారోగ్యంతో బాధ పడుతున్న కూతురితో గోవాకు ప్రయాణం కష్టమని హోం మంత్రిత్వశాఖకు విన్నవించుకున్నా సరే ఢిల్లీ నుండి గోవాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తన డ్యూటీ తాను నిబద్ధతతో చేసినందుకు దక్కిన ప్రతిఫలం ఇది



 1983లో
కిరణ్ బేడీ ట్రాన్స్ఫర్ అయ్యింది


9, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఫిబ్రవరి 09, 2020

TELUGU INSPIRATIONAL STORIES




 TELUGU INSPIRATIONAL STORIES 


జీవితంలో ఎప్పుడైనా ఒక గొప్ప పని సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు అలాంటి సమయంలో మనకు తోడుగా ఎవరు నిలబడరు. ఎవరూ మన పై దృష్టి పెట్టరు. మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు విజయ బాటలో పయనిస్తున్న అప్పుడు వారు అందరూ నీతో నడుస్తారు. ఒక బలహీనమైన వ్యక్తి వెంటనే మీకు  చెప్పగలడు పని ఎందుకు చేయకూడదు అనేది. ఒక బుద్ధి కలవాడు ఒక పనిని ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ బలహీనుడు లాగా ఉండకు. బుద్ధిమంతుడిలా తయారవడానికి ప్రయత్నించు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు పెద్ద పెద్ద పనులు చేసి విజయం సాధిస్తూ ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచం వినబడే దానికంటే కనిపించే దానికే ప్రాముఖ్యత ఇస్తుంది నీ జీవితంలో నీతో మంచి వ్యవహారంతో ఎవరైతే మెలుగుతారో వారికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే వారిని ఇలా ఆలోచించి క్షమించి వదిలేయండి. మానసిక రోగుల అంతా హాస్పటల్ లో మాత్రమే కనిపించరు. బయటి ప్రపంచంలో కూడా కనిపిస్తారని అనుకోండి. కొంతమంది జనం నీ యొక్క మానసిక బలాన్ని ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీ యొక్క మానసిక బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగలరు కానీ మిమ్మల్ని ఓడించలేరు. ఎందుకంటే ఓటమిని మీ అంతట మీరు అంగీకరించని అంతవరకు ఎవరు మిమ్మల్ని ఓడించలేరు. జీవితంలో ఎప్పుడైనా మాట ఇచ్చేటప్పుడు, వ్రాసేటప్పుడు, అడుగు ముందుకు వేసేటప్పుడు, ఆలోచించి చేయాలి. అమ్మ పాడిన జోల పాట మనందరికీ గుర్తుంది కానీ అమ్మ అని పిలిచే అంత సమయం మాత్రం మన జీవితాల్లో లేకుండా పోయింది. ఆధునిక కాలంలో అన్ని సంబంధాలను మనం చంపేస్తూ వస్తున్నాం వాటిని పూడ్చడం మాత్రమే మిగిలి ఉంది. మన వారితో మాట్లాడే సమయమే మన జీవితంలో లేదు ఇక పరాయి వారితో ఏం మాట్లాడగలం. మనకు సరైన నిద్ర పోవడానికి సమయం లేదు సరైన స్నేహాన్ని కొనసాగించడానికి సమయం లేదు బంధుత్వాన్ని కొనసాగించడానికి సమయం లేదు గుండె నిండా చాలా బాధలు కూడా ఉన్నాయి ఆయన సరే మనసారా ఏడవడానికి కూడా సమయం లేదు. నిజంగా డబ్బు సంపాదించాలంటే అలసి పోయే సమయం కూడా లేనంతగా పరిగెత్తాలి. జీవితంలో మనం కనే కలలను సాకారం చేసుకోవడానికి మన దగ్గర సమయం లేనప్పుడు ఇతరుల కనే కలలను మనం అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం ఎక్కడ ఉంటుంది. నీ జీవితంలో ఇలాంటి కొంతమంది వ్యక్తులు నీకు తప్పక ఎదురవుతారు. నీ కంటే తెలివైన వారు, మీ కంటే బలమైన వారు, మీకంటే విజయవంతమైన వారు, నీ కంటే ప్రభావశాలి అయినవారు, మీరు వారందరూ గొప్పవారని భావించినప్పుడు దీనికి అర్థం మీరు అవన్నీ సాధించలేరని కాదు. మీరు వారితో గెలవ లేరని కాదు నీపై మీరు నమ్మకంతో అహర్నిశలు శ్రమిస్తే మీరు తప్పక వారిలాగా విజయం పొందగలరు. ఒకానొక రోజు మీరు గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే నీకంటూ ఒక కొత్త దారి ని వెతకండి దాని గురించి ఆలోచించండి ఆ దారిని రహదారిగా మార్చే లాగా నీ జీవిత లక్ష్యాన్ని ఎంచుకోండి .ఇలా చేసే సమయంలో మనసులో మరే ఇతర ఆలోచనలు రానివ్వకండి. ఈ ప్రపంచంలో  అసంభవం అంటూ ఏదీ లేదు మనం ఆ దిశగా అడుగులు వేయగలిగితే.
TELUGU INSPIRATIONAL STORIES, TELUGU MOTIVATIONAL STORIES
TELUGU LIFE SKILLS 


ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండు



జీవితంలో సంపద అనేది వారసత్వం ద్వారా కూడా లభించవచ్చు. కానీ నీకంటూ గుర్తింపు మాత్రం నువ్వే ఏర్పరచుకోవలసి ఉంటుంది. అందుకే జీవితంలో పోరాడే జీవితం లో పోరాడే టప్పుడు మైదానాన్ని వదిలి ఎప్పుడు వెళ్లాలంటే వెళ్లాలి అంటే విజయం దక్కేనా అంత వరకు పోరాడిన తర్వాతే. విజయానికి మొదటి ఆధారం సరైన ఆలోచన నువ్వు కష్టపడుతూ అడుగు ముందుకు వేస్తూ ఉండు విజయం అనేది నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. నీ దారి మార్చడానికి చాలామంది నీకు ఎదురవుతూ ఉంటారు. కానీ నీ సంకల్పమే చాలు నీ యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఎప్పుడూ నీ యొక్క లక్ష్యాన్ని సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి .విజయవంతమైన వ్యక్తుల మొహంలో మనం రెండు మాత్రమే గమనించవచ్చు 1 నిశ్శబ్దం రెండవది చిరునవ్వు. ఇతరులకు కఠినమైన జవాబు వీరు కూడా ఇవ్వగలరు కానీ నీ బురద పై రాయి వేయడం ఎందుకులే అని ఆలోచించి ఊరు కుంటారు. ఒక్కోసారి నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన చేతకాని వాడు అని అనుకోరాదు .పరిస్థితులను అర్థం చేసుకున్నవాడే నిశ్శబ్దంగా ఉంటాడు. మనం ఏర్పరుచుకున్న లక్ష్యం మన సాహసం కంటే గొప్ప నైనది ఏమీ కాదు పోరాడకుండా ఉండేవాడు ఎప్పుడు ఓడిపోతాడు. అందుకే నీ పై నువ్వు ఎప్పుడూ నమ్మకంతో ఉండు ఇదే నీ బలంగా తయారవుతుంది. అలానే ఇతరులపై నమ్మకం పెట్టుకోవడం వలన అదే నీ బలహీనత అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి చెట్టు కొమ్మపై వాలిన పక్షి బొమ్మలు గాలికి ఊగినంత మాత్రాన కంగారు పడిపోదు. ఎందుకంటే ఆ పక్షి కొమ్మపై కాదు తన రెక్కల పై నమ్మకంతో ఉంది కాబట్టి. నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు చేసే పనిలో ఉండే కష్టాల గురించి నీ సంకల్పానికి చెప్పడానికి ప్రయత్నించకు. నీ పని లో ఉండే కష్టాలకు నీ యొక్క సంకల్పం గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. జనం నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ చింతించకు ఎందుకంటే అది నీ సమస్య కాదు అర్థం చేసుకోలేక పోవడం అనేది వారి సమస్య. నువ్వు ఈదడం నేర్చుకుంటే సముద్రపు లోతును కూడా కొలవగలవు. విజయం పొందడానికి కొన్ని పనులను అలవాటు చేసుకోవాలి. అది ఏమిటంటే అపజయం పొందేవారు చేయడానికి ఇష్టపడని పనులు వాటిని మనం అలవాటుగా చేసుకోవాలి. జీవితం యొక్క చలాకీ ని అర్థం చేసుకోవాలంటే ప్రయాణంలో చెలరేగే దుమ్మును పూల జల్లు లాగా అనుకోవాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే కారణాలు మాత్రమే వెతక గలవు. అదేవిధంగా సమాధానం గురించి మాత్రమే ఆలోచిస్తే కొత్త దారులు దొరుకుతాయి. నీకు ఉండే సమస్యల కంటే నువ్వు చాలా బలవంతుడివి అది నువ్వు అర్ధం చేసుకో

























5, ఫిబ్రవరి 2020, బుధవారం

ఫిబ్రవరి 05, 2020

HOW TO DEVELOP FORESTS




HOW TO DEVELOP FORESTS




ప్రజల్లో మొక్కలు నాటే వృక్షాలను కాపాడే అలవాటు పెంపొందించేందుకు గ్రామీణ సదస్సులు మరియు అనేక సంఘటిత సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ప్రస్తుత కాలంలో ఎంతగానో ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడానికి ఒక సైనికుడిలా గా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి మనిషి తాను జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ కోసం మూడు మొక్కలు నాటాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత అన్న సందేశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి .ఇప్పుడు పిల్లలు మొదలుకొని యువకులు ఉపాధ్యాయులు ,అధికారులు ,ఐఏఎస్ ,ఐపీఎస్, ఐఆర్ఎస్ ,అధికారులు, సినీ, క్రీడా, రాజకీయ, వాణిజ్య ,రంగాల ప్రముఖులు కూడా ఇందులో తప్పక భాగస్వామ్యులు అవ్వాలి. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛమైన గాలి నీరు ఆహారానికి వన సంరక్షణ చేపట్టాలి హరిత స్వప్న సహకారానికి ప్రజలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఒక్కతాటిపైకి రావాలి. ఆకుపచ్చని ఆనందమయ జీవన కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. యువత ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి. కాలుష్యాన్ని నివారించే దీర్ఘకాలంలో ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలను ఉచితంగా అందించాలి. ఎన్ని మొక్కలు నాటాము అనేదానికంటే వాటిలో ఎన్ని బ్రతికాయి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలి. స్థానిక ప్రజలు అధికారులకు బాధ్యతలు అప్పగించి జీవించే మొక్కలు పెంచాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా మొక్కలు నాటుతున్న హరిత సారధులు సంస్థలను గుర్తించి సత్కరిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉంది .పల్లెలు పట్టణాలు నగరాల్లో పార్కులను సక్రమంగా నిర్వహించడంతో పాటు కొత్త పార్కులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి అతితక్కువ పచ్చదనం ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా మొక్కలను పెంచాలి. అప్పుడే ఈనెల పచ్చని హారం గా మారుతుంది. ముందు తరాలకు పచ్చగా బతకడానికి అవకాశం ఉంటుంది.
HOW TO DEVELOP FORESTS, SWACHA BHARATH
WATER POLLUTION 

అందరం కలిసి హరిత క్రాంతిని ముందుకు నడుపుదాం


భారతదేశం లో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది .కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భూభాగం జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది భారతదేశం. ఈ యొక్క సువిశాల దేశంలో పండని పంట అంటూ లేదు .పెరగని మొక్క అంటూ లేదు . అయితే తలసరి ఒక్కో మనిషికి ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నా లెక్కలు చూస్తే మాత్రం విస్తు పోక తప్పదు. ప్రపంచ తలసరి మొక్కల సగటు 422 అయితే మనదేశంలో మనిషికి 28 మొక్కలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని నగరం ఆయన ముంబైలో మరీ ఘోరంగా ఒక్కో మనిషికి తలసరి నాలుగు మొక్కలు మాత్రమే ఉన్నాయి. మొక్కల విషయంలో కెనడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ దేశంలో ప్రతి మనిషికి 8953 మొక్కలు చొప్పున ఉన్నాయి. తర్వాతి స్థానంలో రష్యా 4461 ఆస్ట్రేలియా 3266 మొక్కలు సగటున ప్రతి మనిషికి ఉన్నాయి. మొక్కల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసం ఉండటానికి కారణాలు అనేకం. అటవీ పర్యావరణ విధానాలు వారసత్వ అటవీ సంపద ప్రభుత్వాలు పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యం జన చైతన్యం ప్రజా భాగస్వామ్యం ఇందుకు కారణాలుగా పేర్కొనవచ్చు .భారత్లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొన్నాయి. ఫలితంగా దేశంలో పచ్చదనం తరిగిపోతోంది అడవులు కనుమరుగైపోతున్నాయి.


అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరిదీ


అడవుల విస్తీర్ణం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తగ్గిపోతుంది. అమెరికాకు చెందిన  సంస్థ అధ్యయనం ప్రకారం భూగోళంపై వెయ్యి కోట్ల ఎకరాల అడవులు ఉండగా 1990 నుంచి 12.9 కోట్ల  హెక్టార్ల అడవులు అన్యాక్రాంతం అయ్యాయి. వంటచెరకు కలప స్మగ్లింగ్ చెట్ల నరికివేత పట్టణీకరణ ఆక్రమణ అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు తదితర కారణాలతో అరణ్యాలు నానాటికి కుదించుకు పోతున్నాయి. సుమారు 90 కోట్ల ప్రజల నిత్య జీవన అవసరాలకు అడవులే ఆధారం భారతదేశంలో అడవులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. 1988 నాటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో మూడోవంతు భూభాగంలో అడవులు ఉండాలి. అయితే 24 .39 శాతమే విభాగం ఉంది భారత అటవీ సర్వే సంస్థ 2017 లో ఒక నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే వెనకబడి పోయాయి. రాష్ట్రాల్లో నగరాలు పట్టణాల్లో పలుచబడుతుంది. చెరువులు తోటల నగరం గా పేరున్న తెలంగాణ రాజధాని హైదరాబాదులో 60 శాతం హరిత విస్తీర్ణం తగ్గిపోయింది. ఏటా జనాభా వృద్ధి , పెరుగుతున్న స్థిరాస్తి క్రయ విక్రయాలు పట్టణీకరణ కారణంగా అడవులు కనుమరుగు అవుతున్నాయి. నానాటికీ తగ్గుతూ అటవీ విస్తీర్ణం అనేక దుష్ఫలితాలకు దారితీస్తోంది. ఫలితంగా మానవాళి పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది అడవులు తగ్గిపోతూ ఉండడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవడం లేదు భూతాపం పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల ప్రభావం అధికమై ఓజోన్ పొర దెబ్బతింటుంది. కరువు కాటకాలు తీవ్రమై రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీటి కొరత నానాటికీ తీవ్రమై పోతుంది తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ఎంతోమంది అల్లాడుతున్నారు. అడవుల్లో ఆహారం మూగజీవాలు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఇల్లు పంట పొలాలపై దాడిచేసి నష్టం కలిగిస్తున్నాయి. చెట్లు మనిషి శ్వాస ఆహారం ఆరోగ్యం ఆనందమయ జీవితాన్ని ఇచ్చేది చెట్టు తల్లి మాత్రమే. ఒక అభివృద్ధి చెందిన చెట్టు సంవత్సరానికి 24 లక్షల విలువ కలిగిన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆరోగ్యవంతమైన వృక్ష ఏడాదికి 0.53 టన్నుల బొగ్గు పులుసు వాయువు, 1.95 కిలోగ్రాముల కాలుష్య కారకాలను శుద్ధి పరుస్తుంది. రోజు ఒక వ్యక్తి పీల్చే ప్రాణవాయువు పరిమాణం 3 ఆక్సిజన్ సిలిండర్ లతో సమానం. ఒక వ్యక్తి తన జీవిత కాలానికి కావలసిన ఆక్సిజన్ పొందాలంటే మూడు పెద్ద చెట్లు కావాలి. మనిషి జీవితంలో వృక్షాలు ఇంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తి కనీసం ఒక్క మొక్క  నాటుతున్న రా అంటే లేదనే చెప్పాలి. ఈ విషయంపై యువతకు సరైన అవగాహన కల్పించాలి. యువత కూడా భవిష్యత్తు కోసం మొక్కల పెంపకం చేపట్టాల్సిన అవసరం తప్పకుండా అందరికీ ఉంది. పండ్ల మొక్కలు నాటడం వలన కొంత ఆర్థికంగా కూడా రైతులు లబ్ధి పొందవచ్చు. అదే సమయంలో పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతినకుండా కాపాడవచ్చు.
HOW TO DEVELOP FORESTS, AIR POLLUTION
GREEN ENVIRONMENT 


మానవ మనుగడకు మొక్కలు మూలాధారం



 ఎప్పుడూ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి చెట్లకు మించిన సేవకులు ఉపకారం సృష్టిలో లేరు వాటి గొప్పదనం గురించి వర్ణించిన కవి లేరు. జీవజాలానికి ప్రాణవాయువు ఫలాలు అందించే చెట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు అవి లేనిదే అది లేదు మీరు లేదు చివరికి నాగరికత లేదనడం అతిశయోక్తి కాదు. ప్రకృతిలో భాగమైన చెట్టు పుట్ట నదులను పూజించే గొప్ప సాంప్రదాయం భారతీయులది .ఇదే సమయంలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా హరిత  నష్టం జరుగుతున్నది. మనదేశంలోనే కావడం ఆందోళన కలిగించే అంశం తలసరి మొక్కల విషయంలో దేశం అట్టడుగు స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చీకటిలో చిరుదీపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు పచ్చదనానికి యువకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని భాగస్వాములను చేస్తూ మన అందరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది దేశంలో ఏ ఒక్కరి సమస్య కాదు ఏ కులానికి మతానికి జాతికి వర్ణానికి ఏ భాషకు చెందిన సమస్య కాదు. ఇది మన భారతీయుల అందరి సమస్య ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై చైతన్యవంతం అవడం ఎంతో అవసరం.


13, జనవరి 2020, సోమవారం

జనవరి 13, 2020

TELUGU MOTIVATIONAL STORIES





TELUGU MOTIVATIONAL STORIES





పొడవైన దారం చిక్కుబడి పోతుంది. అనవసరమైన మాటలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే దారాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవాలి . నోట్లో నాలుకను కూడా చాలా అదుపులో ఉంచుకోవాలి. ఇతరులను ఎగతాళి చేసేటప్పుడు మరియు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించు. ప్రజలకు ఎవరికీ చట్టాలు నచ్చవు, మరియు వాగ్దానాలు నచ్చవు. కానీ కేవలం వారి యొక్క ప్రయోజనాలే వారికి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే అర్థం చేసుకోవచ్చు వారి పొగడ్తల వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది అని

భగవంతుడిని మనం శక్తి కావాలని కోరితే మనల్ని కష్టాల్లోకి నెట్టి వేస్తాడు. కష్టాల వలన మీ ధైర్యం పెరుగుతుంది మరియు మీరు శక్తిశాలి గా తయారవుతారు. మీరు సరైన వారు అయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి వారిగా కొనసాగుతూనే ఉండండి సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. చాలామంది సులువైన దారిలో మాత్రమే నడవడానికి ఇష్టపడతారు. చాలామంది నడుస్తున్నారు కదా అని అది సరైన దారి అనుకోవడం కూడా పొరపాటే, నీ దారిని మీరు స్వయంగా నిర్మించుకోండి. ఆ యొక్క దారిని నీ కంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు. గొప్ప పనులు చేయడానికి ఒకటే పద్ధతి ఉంటుంది. మీరు ఏ పని అయితే చేస్తారో దానిని ఇష్టంగా చేయండి.
TELUGU MOTIVATIONAL STORIES, LIFE SUCCESS STORIES IN TELUGU
TELUGU INSPIRATIONAL STORIES 



నీ జీవితం వలన కొందరు జీవితంలోనైనా రంగులు నిండేలా చూడు



 రావి చెట్టు ఆకు లాగా తయారు అవ్వకండి సమయం రాగానే ఎండిపోయి రాలిపోతుంది. గోరింటాకు లాగా తయారవండి ఎండిపోయిన తర్వాత కూడా నూరి తే ఇతరుల జీవితాలలో రంగుని నింపుతుంది. మీరు ఎప్పుడైనా ప్రియమైన మాటలు వినాలి అనుకుంటే దానికంటే ముందు మీరు ప్రియమైన మాటలు మాట్లాడవలసి ఉంటుంది. ఒక దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా దానికి నూనె పోయాల్సి ఉంటుంది . కింద పడిపోతాం అని ఎవరైతే భయపడతారో వారు జీవితంలో ఎప్పుడూ ఎదగలేరు. మనిషి యొక్క రంగు ఎంత ఎరుపు అయినా కావచ్చు, కానీ  వారి యొక్క నీడ మాత్రం నలుపు గానే ఉంటుంది.



అహంకారంతో ఎప్పుడూ ఉండకు




నేను శ్రేష్టమైన వాడిని అనుకోవడం ఆత్మవిశ్వాసం అవుతుంది . అదేవిధంగా నేను మాత్రమే శ్రేష్టమైన వాడిని అని అనుకుంటే అహంకారం అవుతుంది. కష్టాల యొక్క ప్రాముఖ్యత జీవితంలో చాలా ఉంటుంది. మీ విజయం యొక్క ఆనందం పొందాలంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. హృదయాలను గెలవడమే లక్ష్యం గా పెట్టుకోండి, ఎందుకంటే సికిందర్ ప్రపంచాన్ని మొత్తం జయించాడు, అయినా సరే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు మనం ఏదైతే ఆలోచించగలమొ అది మనం చేయగలం. ఇంత వరకు ఎవరూ ఆలోచించనివి మనం ఆలోచించగలము ఎవరు చేయనివి మనం చేయగలం మనం కోరుకున్నది మనకు దొరికితే అది విజయం అవుతుంది దొరికిన దానిని ప్రేమించడంలో ఆనందం ఉంటుంది







అదృష్టవంతులు ఎవరు అంటే వారు మంచివి అన్నీ లభించిన వారు కాదు, ఉన్నవాటిని మంచిగా తయారు చేసుకునే వారు అదృష్టవంతులు. మార్పు లేకుండా ఎదుగుదల అనేది అసంభవం . ఎవరైతే వారి ఆలోచనలు మార్చకుండా ఉంటారో వారు జీవితంలో ఏ మార్పు సాధించలేరు. ఎవరి మనసు నైనా నొప్పించి క్షమించమని అడగడం చాలా సులువు కానీ ఇతరులు మనసును నొప్పించిన సరే వారిని క్షమించడం చాలా కష్టమైపోతుంది. జీవితం మనకు నవ్వు ప్రసాదించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం చేసిన మంచి పనులు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయని, అదే జీవితం మనల్ని ఏడిపిస్తుంటే మంచి పనులు చేయ వలసిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఖాళీ సమయం ఉంటే ఇతరులతో గడుపుతూ ఉంటారు, మరికొంతమంది మన అనుకొని సమయం గడుపుతూ ఉంటారు. జీవితంలో సంపాదిస్తూ యుండు ఖరీదైన వస్తువులు కూడా నీకు ధర తక్కువ వస్తువులు అనిపించేంత వరకు. ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకుంటే నీకు ఆ ఆనందం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది , అదే క్షమించి వదిలేస్తే ఆ యొక్క ఆనందం జీవితకాలం ఉంటుంది.

మంచి వ్యక్తుల విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు



మంచి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడం చాలా సులువైన పని అందుకే ఎప్పుడూ మంచి వ్యక్తులకే చెడు జరుగుతూ ఉంటుంది మోసం చేసే వ్యక్తికి ఈ విషయం అసలు తెలియదు మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే దక్కుతుందని అందుకే ఎప్పుడూ చెడ్డ వ్యక్తిని చూసి చెడ్డవాడిగా తయారవకు మనం వజ్రాన్ని వజ్రంతో వజ్రం తో కోయ గళం అంతేకానీ బురద నీటిని బురద నీటితో శుభ్రం చేయలేము ఎప్పుడు ఈ ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది ఎంతలా అంటే పంట పొలాల్లో బిల్డర్స్ రోడ్డుపైన రైతులు నిలబడ్డారు













29, డిసెంబర్ 2019, ఆదివారం

డిసెంబర్ 29, 2019

LIFE SKILLS IN TELUGU








LIFE SKILLS IN TELUGU




జీవితంలో జరిగే పెద్ద పొరపాటు ఏమిటంటే ఏదైనా మనం తప్పు చేస్తే దాని నుండి మనం గుణపాఠం నేర్చుకోకపోవడమే పెద్ద పొరపాటు . ఎవరైనా వ్యక్తి నీతో బంధుత్వాన్ని కొనసాగించడానికి ఇష్టపడకపోతే అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. సమయం వారికి తప్పకుండా గుణపాఠం నేర్పిస్తుంది. అంతవరకు మీరు వే వేచి ఉండాలి. ఈ ముగ్గురి యొక్క అనుబంధాలను ను ఈ మూడు సమయాలలో గుర్తించవచ్చు. భార్యను భర్త పేదవాడిగా ఉన్నప్పుడు, స్నేహితుడిని కష్టాలలో ఉన్నప్పుడు, పిల్లలను తల్లిదండ్రులు ముసలివారు అయినప్పుడు, వారి యొక్క అనుబంధాన్ని గుర్తించవచ్చు . మనం ఏడవడం మొదలు పెడితే అవతలివారు నవ్వడం మొదలు పెడతారు. ఇవి తెలుసుకోవాలంటే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.




ఏ పనినైనా నిరాటంకంగా చేయడం అలవాటు చేసుకోవాలి





ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి. ఒక అలవాటు మిమ్మల్ని అపజయం పొందేలా చేస్తుంది. ఆ అలవాటును తప్పకుండా మానుకోండి లేకపోతే భారీ నష్టాన్ని ఈ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది.  అనగా  అనగా రాగ మతిశయిల్లుచునుండు. తినగ తినగ వేము తియ్యనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు గొప్ప కవులైన ఎందరో మహానుభావులు ఎప్పటినుండో మనల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు.  వారి రచనల ద్వారా కాని వాటిని మనం పట్టించుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. పాడగా పాడగా చక్కటి గాయకుడిగా తయారవ్వచ్చు. తినగా తినగా చేదైన వేపాకు కూడా తియ్యగా తయారవుతుంది. చేయగా చేయగా అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటారు . ఇప్పుడు ఇదే మన జీవితంలో అపజయానికి పెద్ద కారణం .  మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలంటే ఏ పనినైనా నిరాటంకంగా కొనసాగించాలి. మీరు ఒక విద్యార్థి అయితే మీరు నిరాటంకంగా చదివినట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది. మరియు మీయొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెరుగు పడుతుంది. బయటి ప్రపంచంలో ఎలాంటి పోటీ నైనా మీరు తట్టుకోగలరు నిరాటంకంగా చదివినప్పుడు. కాలేజీ పని దినాలలో మీరు సరిగా హాజరు కాకుండా ఉండడం వలన అది నీకే పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ యొక్క పని ఫలితం నువ్వు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ప్రతి రోజు కాలేజీకి హాజరై ప్రతి క్లాసులు శ్రద్ధగా వింటూ చదువుతూ ఉండు ఈ ప్రక్రియను నువ్వు నిరాటంకంగా కొనసాగించినట్లు అయితే విజయం పొందడం లో నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు.



LIFE SKILLS IN TELUGU, INSPIRATIONAL STORIES  IN TELUGU
MOTIVATIONAL STORIES IN TELUGU 


ఏ పనినైనా నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగించు





కరుకైన  రాయి పైన కూడా మనం రాయగా రాయగా గుర్తులు ఎలా ఏర్పడతాయో అలానే మళ్లీ మళ్లీ అభ్యాసం చేయడం ద్వారా మంద బుద్ధి గల వారు కూడా తెలివైన వారుగా తయారవుతారు. అందుకే ఏ పనినైనా నిరంతరంగా అంటే కంటిన్యూగా చేయాలి. ఏ పనినైనా ఎవరైనా సరే నిరంతరంగా కొనసాగించ లేకపోవడం వల్లనే వారు జీవితంలో అపజయం పొందుతూ ఉంటారు. మీరు ఈరోజు నుంచి ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను ఈరోజు నుండి  చదువుతాను ,ఈ రోజు నుండి నా మనసును కంట్రోల్ చేసుకుంటాను, ఈరోజు నేను ఈ పని తప్పకుండా చేస్తాను ,ఒక గంట కాదు రెండు గంటలు చేస్తాను, అని మీరు నిర్ణయం తీసుకొని ఉంటారు. మరుసటి రోజు మీరు ఈ నిర్ణయాలను అన్నింటినీ మర్చి పోవడం జరుగుతుంది. మీరు చదవడం వంటివి చేస్తే ఒక రోజు చదివితే లేదా ఒక రోజు పని చేయడం ద్వారా మీరు విజయం పొందలేరు ఆ పనిని లేదా చదువుని నిరంతరాయంగా నిరాటంకంగా కంటిన్యూగా కొనసాగించినట్లు అయితే మాత్రమే మీరు విజయం పొందగలరు. మన మనసును కూడా ప్రతిరోజు కంట్రోల్ చేస్తూనే ఉండాలి. ఏ పనినైనా ఒకరోజు సంతోషంగా చేయడానికి మొదలుపెడతారు, మరుసటి రోజు మర్చిపోతారు .ఒక రోజు రెండు రోజులు ఆ పని చేయడం వలన ఏమీ ఉపయోగం ఉండదు. మీరు ఒక రోజు రెండు రోజులు జిమ్ కు వెళ్లడం ద్వారా శారీరక మార్పు తీసుకు రాలేరు. కదా సంవత్సరం పొడవునా ఆ పనిని నిరంతరాయంగా కొనసాగించినట్లు అయితే మీ యొక్క శారీరక మార్పు తీసుకు రాగలరు. ఒక నది తన బలంతో కాకుండా నిరంతరాయంగా ప్రవహించడం ద్వారానే పెద్ద పెద్ద కొండల మధ్య నుండి తన దారిని ఏర్పరుచుకో గలుగుతుంది. వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి నిరంతరాయంగా నిరాటంకంగా కురిసినప్పుడు ఆ చిన్న చిన్న బిందువులే నదిగా ప్రవహించడం జరుగుతుంది. మనం జీవితంలో చేసే చిన్న చిన్న ప్రయత్నాలే నిరంతరాయంగా కొనసాగించినట్లు అయితే మార్పు అనేది తీసుకురావచ్చు. విజయానికి మొదటి సూత్రం ఏమిటంటే నిరంతరాయంగా నిరాటంకంగా ప్రయత్నం చేయడం మాత్రమే. మీరు నిరంతరాయంగా ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిరోజు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మీరు గుర్తు చేసుకోవాలి, నీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటో.



జీవితంలో ఎదగాలంటే సోమరితనం వదిలివేయాలి





సోమరితనం అనేది ఏ పనినైనా నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగించడానికి అడ్డు పడుతూ ఉంటుంది. సోమరితనాన్ని మీ జీవితానికి దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఉండండి. పని పై నుండి చదువు పై నుండి నీ యొక్క ధ్యాసను మరల్చకుండా ఉండండి. ప్రతిరోజు ఉదయాన్నే మీ యొక్క జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. నీ యొక్క లక్ష్యాన్ని మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు ఎనర్జీ గా పని చేయగలరు, చదవగలరు అప్పుడు సోమరితనం నీ దరిదాపుల్లోకి రాదు. సోమరి అయిన వ్యక్తికి వర్తమానం అంటూ ఉండదు, భవిష్యత్తు అంటూ ఉండదు, సోమరితనం తో జీవితాన్ని గడపడం అంటే ఆ జీవితం వ్యర్థం అనే చెప్పాలి. జీవితం యొక్క విలువ మరియు సమయం యొక్క విలువ  తెలియకుండా సోమరి అయిన వ్యక్తి తన యొక్క విలువైన జీవితాన్ని విలువైన సమయాన్ని వృధా చేస్తాడు. నది ఎలాగ ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుందో తిరిగి రాకుండా, అలాగే జీవితంలో సమయం కూడా  మనిషి యొక్క ఆయువును తీసుకొని వెళ్ళి పోతూ ఉంటుంది. సరైన దినచర్య అంటూ లేకపోవడం వలన మనం సోమరులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇదే సోమరితనం మన దినచర్య లాగా అలవాటు అవుతుంది. ఈ సోమరితనం వలనే మన పని పైనుండి మన ధ్యాస మరలడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీ యొక్క లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ ఉండండి. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు దూసుకుపోతూ ఉండండి. ఈ రోజు నుండి మీరు సోమరితనాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాం




విజయవంతమైన వ్యక్తిగా నిన్ను నువ్వు తయారు చేసుకో





సమయం ఎప్పుడూ మనల్ని బాధించదు, సరైన సమయంలో మన తోడును వదిలి వెళ్లే వారే మనకు దుఃఖాన్ని ఇస్తారు. జీవితం ఒక అద్దం లాంటిది, మీరు నవ్వితే  అది కూడా నవ్వుతుంది. చెడ్డ వ్యక్తి పై నమ్మకం పెట్టుకొని మోసపోయిన తర్వాత మాత్రమే, సరైన మంచి మంచి వ్యక్తిని గుర్తించే అనుభవం దక్కుతుంది. ఎప్పుడూ చిన్న తప్పుల నుండి చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఏ వ్యక్తి కొండల వలన గాయాలపాలు అవ్వడు చిన్న చిన్న రాళ్ల ద్వారానే గాయాలపాలు చెందుతాడు. జీవితంలో వంద సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు, తక్కువ కాలం బ్రతికిన సరే జనం యొక్క గుండెల్లో నిలిచి పోయేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మోసపోయే వ్యక్తి ఎప్పుడూ మోసం చేసే వ్యక్తి కంటే తక్కువగా కోల్పోతాడు ఏదైనా సరే. ఎంత విచిత్రమో చూడండి, వాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. మనం అవకాశం ఇస్తూనే ఉంటాం. కంటి రెప్పల కింద ఉండే నల్లటి చారలు మనకు తెలియజేస్తాయి, నీ పెదాలపై ఉండే చిరునవ్వు అబద్ధమని. మోసం చేసే వారికి అవకాశం దొరుకుతుంది అంటే దానికి అర్థం మన జ్ఞానం మసకబారి పోయిందని. మోసానికి అవకాశం ఇవ్వడం వలన మనం  దోషిగా నిలబడవలసి వస్తుంది.




అదృష్టాలు పై నమ్మకం వదిలేయ్ నీ హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్ముకో




చేతి యొక్క అదృష్ట రేఖ ప్రేరణ లో మునిగి పోకండి. ఎందుకంటే జ్యోతిష్యాలయం లో నీ అదృష్ట రేఖలు అమ్మబడవు కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పోరాడే మీ స్వభావాన్ని మార్చుకోండి. అలవాటు చేసుకో కష్టాల్లో కూడా చిరునవ్వులు చిరునవ్వులు చిందించడం. చెట్టు కింద పెట్టిన విరిగిపోయిన భగవంతుడు విగ్రహాలను చూసి నేర్చుకో, ఈ ప్రపంచం విరిగిపోయిన భగవంతుడి విగ్రహాన్ని ఇంట్లో నుండి బయటకు పంపించి వేసారు. అలాంటప్పుడు మన లెక్క ఎంత, అందుకే నిన్ను నువ్వు నువ్వు విరిగి పోకుండా చూసుకో. ఎవరికి మద్దతు ఇవ్వలేక పోయినా సరే, కానీ  ఎవరికి హాని మాత్రం తలపెట్టకు. పువ్వు లాగా వికసించడం నీకు తెలియకపోతే ఏమీ పర్వాలేదు, కానీ  ముల్లు లాగా మాత్రం తయారవకు. ఇతరులు మిమ్మల్ని ఎవరూ గుర్తు చేసుకోక పోయినా సరే మీరు ఇతరులను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే సం బంధాలు బంధుత్వాలు సాగించడానికి పోటీ తో పని లేదు కదా! జీవితంలో ఒక మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకో పొగడ్తలతో ఎప్పుడూ కరిగి పోకు, విమర్శలకు కుంగిపోకు. నిన్ను నువ్వు ఇబ్బందులను ఎదుర్కొనేలా తయారు చేసుకో ఎందుకంటే ఇతరులు నీకు ఇబ్బంది కలిగించినప్పుడు బాధ అనేది ఉండదు. ఫకీర్ తో ఎప్పుడూ ఇలా విజ్ఞప్తి చేయకండి, భిక్షాటనకు ఎప్పుడూ రావద్దని, ఎందుకంటే ఫకీర్ బిక్షాటనకు మాత్రమే కాదు ఆశీర్వదించడానికి కూడా వస్తాడు మంచి మనుషులతో ఎప్పుడూ గొడవ పడకు గొడవ పడితే నీతో వారు తిరిగి గొడవపడరు కానీ మీ జీవితం నుండి వారు దూరంగా వెళ్ళి పోతారు. దుఃఖం అనేది ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది అప్పుడే కదా మనకు సుఖం యొక్క విలువ తెలిసేది.